పవన్ కి వీరాభిమాని అని అంటూ చెప్పుకునే బండ్ల గణేష్ ఇటీవల మెగా కాంపౌండ్ కి కాస్త దూరం అయినట్లుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన భీమ్లా నాయక్ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు లీకైన ఒక ఫోన్ కాల్ సంభాషణ ఆయన్ని పవన్ కళ్యాణ్ కి దూరం చేసింది అంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ను నిర్మించి నిర్మాతగా మళ్లీ గాడిలో పడాలని ఎదురు చూస్తున్న బండ్ల గణేష్ కి కచ్చితంగా పవన్ కళ్యాణ్ దూరం అనేది షాక్ అని చెప్పాలి.
ఇప్పుడు ఏం చేయాలి అనేది బండ్ల గణేష్ కి పాలు పోవడం లేదు అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి చిరంజీవి రావాలి.. ఆయన కచ్చితంగా జనసేన పార్టీకి బలం అవుతారు అంటూ ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన బండ్ల గణేష్ ‘మరి నేను?’ అంటూ పోస్టు పెట్టాడు. అంటే తాను కూడా జనసేన పార్టీ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని.. వస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా జనాలను అడుగుతున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ ఉంది అంటున్నారు. ఒకవేళ బండ్ల గణేష్ జనసేన లోకి వెళ్లాలి అనుకున్నా పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
287736 99928hello, your internet site is truly excellent. We do appreciate your give great results 874328
274214 225000Any person several opportune pieces, it comes surely, as effectively as you bring in crave of various the numerous other types of hikers close to you with hard part your question. pre owned awnings 750136