నందమూరి బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. సినిమా చివరి షెడ్యూల్ ను విదేశాల్లో పూర్తి చేయాల్సి ఉంది. అమెరికాకు ఈ సినిమా యూనిట్ సభ్యులు వెళ్లేందుకు మొదట ప్లాన్ చేశారు. కాని తాజాగా అమెరికా వీసా లు కష్టం అవుతున్న నేపథ్యంలో టర్కీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ ను దాదాపుగా మూడు వారాల పాటు నిర్వహిస్తారని తెలుస్తోంది. అక్కడ షూట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి.
బాలయ్య 107 సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖండ తర్వాత బాలయ్య నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండబోతున్న విషయం తెల్సిందే.
909511 39319We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 394323