నాలుగో వారంలోకి బిగ్‌బాస్ ఎంటర్ అయిపోయింది. నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. రేసులో ఈసారి 8 మంది నిలిచారు. శ్రీముఖి గత వారం దొంగ – పోలీస్ టాస్క్ సందర్భంగా ప్రాపర్టీని డామేజ్ చేసినందుకుగాను డైరెక్ట్‌గా ఈ వీక్ ఎలిమనేషన్కి నామినేట్ అయిన సంగతి తెల్సిందే. మరోపక్క నామినేషన్స్ పర్వంలో భాగంగా ఇద్దరేసి కంటెస్టెంట్స్‌ని ఒక్క చోట కూర్చోబెట్టి ‘ఒకరు వుండాలి, ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి’ అని షరతు పెట్టాడు బిగ్‌బాస్.
ఈ క్రమంలో రవి కృష్ణ, శివ జ్యోతి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్ సందర్భంగా ఓవరాక్షన్ చేసిన దరిమిలా రోహిణిని కూడా నామినేట్ చేశాడు బిగ్‌బాస్. వితిక – రవి మధ్య కొంత ఫ్రెండ్లీ ఈక్వేషన్ డెవలప్ అవడంతో నామినేషన్ ప్రక్రియలో తనను తాను నామినేట్ చేసుకుని, వితికని సేవ్ చేశాడు రవి. ‘ఇప్పటిదాకా నేను నామినేషన్స్‌లో లేను కదా’ అంటూ వితికని రవి కన్విన్స్ చేయడం గమనార్హం.
మరోపక్క బాబా భాస్కర్ – అషు రెడ్డి మధ్య చిన్నపాటి హాట్ డిస్కషన్ చోటు చేసుకుంది. అషు, బాబా భాస్కర్ని నామినేట్ చేసింది. పునర్నవి, అలీ ‘సీక్రెట్ టాస్క్’ ద్వారా నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. దాంతో, ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్లలో వీరి పేర్లు విన్పించలేదు. ఇదిలా వుంటే, బాబా భాస్కర్ లేదా సావిత్రిలలో ఎవరో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేందుకు అవకాశాలున్నాయి. బాబా భాస్కర్ మీద ఆల్రెడీ నెగిటివిటీ క్రియేట్ అయిన దరిమిలా, ఈ ఇద్దరిలో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ బాబా భాస్కర్‌కే ఎక్కువ.