Switch to English

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్: కస్టడీ విచారణలో అచ్చెన్న ఏం చెప్పినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ లో ఏ2 నిందితుడిగా చూపిస్తూ అరెస్ట్‌ చేసిన ఏసీబీ, ఆయన్ను మూడు రోజులపాటు విచారించింది. అనారోగ్యం నేపథ్యంలో ప్రస్తుతం ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా, అక్కడే ఆయన్ని ‘కస్టడీలోకి తీసుకుని’ విచారణ చేపట్టింది ఏసీబీ. అయితే, మూడు రోజుల కస్టడీ విచారణలో అచ్చెన్నాయుడు నుంచి ఎలాంటి సమాధానాల్నీ ఏసీబీ రాబట్టలేకపోయిందట. ఈ విషయాన్ని స్వయానా అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థ తేల్చి పారేసింది. ఇది ఈ రోజు అప్‌డేట్‌.

కానీ.. ఇంతకు ముందు ఇదే మీడియాలో ‘విచారణలో కీలక విషయాలు రాబడ్తున్న ఏసీబీ..’ అంటూ ఇదే వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిచ్చాయి. అచ్చెన్న విషయంలో ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధించింది.? ఎలాంటి సమాధానాలు రప్పించింది.? అన్న విషయాలపై స్పష్టత ఇవ్వాల్సింది ఏసీబీనే. విచారణ అనంతరం ఆ వివరాల్ని ఏసీబీ, న్యాయస్థానం ముందుంచుతుంది. కానీ, ఈలోగా వైసీపీ అనుకూల మీడియా చెయ్యాల్సినదానికంటే పదింతలు ఎక్కువ రాద్ధాంతం చేసేస్తోంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టులు, విచారణలు.. ఆ తర్వాత బెయిల్‌ రావడం, రాకపోవడం.. ఇదంతా ఓ ప్రసహనం. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏం జరిగిందో చూశాం. చాలా కేసుల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం. అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరుగుతుందన్నది ముందు ముందు కాలమే సమాధానం చెప్పాలి.

అయితే, రాజకీయంగా అచ్చెన్నాయుడికి ఈ ఎపిసోడ్‌ అనూహ్యమైన పాపులారిటీ తెచ్చిపెట్టిందన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన’ చందాన బొటాబొటి మెజార్టీతో గెలిచారు. కానీ, ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో పరిస్థితి వేరు. అచ్చెన్నాయుడి మీద విపరీతమైన సింపతీ క్రియేట్‌ అయ్యింది. అందుక్కారణం.. అచ్చెన్న అరెస్ట్‌ చుట్టూ టీడీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్స్‌తోపాటు, వైసీపీ చేసిన యాగీ కూడా. ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ లో అచ్చెన్నకు పాత్ర వుంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. కానీ, అది తేలేదెప్పుడు.? ఈలోగా ‘క్యారెక్టర్‌ అసాసినేషన్‌’ మాత్రం చేసెయ్యాలని వైసీపీ, దాని అనుకూల మీడియా తెగ ప్రయత్నించాయి.. మరి, ఫలితం వచ్చిందంటారా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...