సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అయిన అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అక్టోబర్ 2న ఓటిటి ద్వారా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎవరికీ పెద్దగా నచ్చకపోవడంతో ఈ చిత్ర టీం కి సక్సెస్ రాలేదు. అది కాసేపు పక్కన పెడితే నిశ్శబ్దం ప్రమోషన్స్ టైంలో అనుష్క ప్రస్తుతానికి రెండు కథలను ఓకే చేశానని, ఆ వివరాలు ఆ ప్రొడక్షన్ టీమ్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలిపింది.
ఆ సినిమా విశేషాల గురించి తెలుసుకోగా మాకో క్రేజీ కాంబినేషన్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ తన పాగా వెయ్యాలని ట్రై చేస్తున్న యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ – అనుష్క కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకి విజయ్ దేవరకొండ – అనుష్క జోడీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఇరువురికి కథ వినిపించగా, కథ నచ్చడంతో ఇద్దరు ఈ సినిమా చేయడానికి సముఖంగా ఉన్నారని సమాచారం. ఫైనల్ గా అన్నీ సెట్ అయితే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.
‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేతిలో సెట్స్ పై ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో ‘ఫైటర్’ చేస్తున్నాడు. అది కాకుండా శివ నిర్వాణ, మోహన కృష్ణ ఇంద్రగంటి, సుకుమార్ ల సినిమాలు చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఏ సినిమా గ్యాప్ లో అనుష్క సినిమా ఫినిష్ చేస్తారో చూడాలి..
540085 212472Im having slightly issue I cant subscribe your feed, Im using google reader fyi. 742908
280771 791962Great paintings! That is the kind of info that should be shared around the web. 362688
430436 921716Hello there! Nice post! Please inform us when all could see a follow up! 172711