సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా సినిమాకు హిట్ టాక్ దక్కింది. సినిమాను థియేటర్లలో విడుదల చేసి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలోనే సినీ ప్రముఖులు పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. విజయ్ దేవరకొండ సినిమాపై స్పందిస్తూ మా గ్యాంగ్ లో ముగ్గురు కన్నీరు పెట్టుకున్నారు అంటూ చాలా డెప్త్ గా సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో ఏపీ సీఎం జగన్ చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.
సూర్య మరియు జగన్ లు మిత్రులు వీరిద్దరి మద్య చాలా కాలంగా స్నేహం ఉందనే విషయం తెల్సిందే. ఆ కారణం వల్లే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను జగన్ చూడాలని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. సీఎం జగన్ ఎప్పుడు సినిమాను చూస్తాడు అనే విషయమై ఇంకా క్లారిటీ లేదు. కాని థియేటర్లు స్క్రీనింగ్ ఎక్కడ లేదు కనుక ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారానే సినిమాను చూడాల్సిందే. సినిమా చూసిన తర్వాత జగన్ స్పందించే అవకాశం ఉంది.
సీఎం జగన్ సినిమాను చూస్తే ఆ సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే తెలుగు మరియు తమిళంలో అత్యధికంగా ఈ సినిమాను ప్రేక్షకులు చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ సినిమా చూడటం వల్ల మంచి పబ్లిసిటీ దక్కుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సూర్య మరియు సుధ కొంగరలు కలిసి జగన్ కు సినిమా చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు.