Switch to English

రఘురామ బాటలో ఆనం.! లిస్టులో తర్వాతి పేర్లు ఎవరివి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏనాడో ‘అనధికారికంగా’ ఔట్ అయిపోయారు. ఈ లిస్టులోకి తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేరు చేరుతోంది. నిజానికి, గతంలోనే ఆయన వైసీపీని వీడతారనే ప్రచారం జరిగినా, ఆయన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

‘నర్సాపురం ఎక్స్‌ప్రెస్ నెల్లూరు మీదుగా ఢిల్లీకి వెళుతోంది.. ఈ క్రమంలో చాలామంది ప్రయాణీకులు ఆ రైలెక్కేందుకు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా వున్నారు..’ అంటూ కొద్ది నెలల క్రితం ప్రచారం జరిగిన విషయం విదితమే.

జిల్లాల విభజన అంశాన్ని ఆయుధంగా మలచుకుని ఆనం రామనారాయణరెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. షరామామూలుగానే అధికార వైసీపీ, తమ ఎమ్మెల్యే మీదనే ‘ఎదురుదాడికి’ దిగుతోందనుకోండి.. అది వేరే సంగతి.

కాగా, ఆనం రామనారాయణరెడ్డి ఒకప్పుడు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడేగానీ, గత కొంతకాలంగా ఆయన రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన అభిమానుల్నే గందరగోళంలో పడేస్తున్నాయి. ఇప్పూడు కూడా ఆనం విషయంలో ఎలా స్పందించాలో ఆయన అనుచరులకు అర్థం కావడంలేదు.

ఇదిలా వుంటే, ఆనం రామనారాయణరెడ్డితో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్ళారట. బీజేపీలోకి ఆయన్ని ఆహ్వానించారట కూడా. అదే సమయంలో, పాత స్నేహంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆనం రామనారాయణరెడ్డిని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది.

రెండున్నరేళ్ళ తర్వాత మంత్రి వర్గ విస్తరణ వుంటుందనీ, దాదాపు క్యాబినెట్ అంతా మారిపోతుందనీ ముఖ్యమంత్రి అవుతూనే పార్టీ నేతలకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రెండున్నరేళ్ళు పూర్తయిపోయినా.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోలేదు.

దాంతో, మంత్రి పదవులపై ఆశపడ్డ నేతలు, మంత్రి పదవులు రావనే గట్టి నమ్మకం ఏర్పరచుకున్న నేతలు.. వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. లిస్టు తీస్తే డజన్ల సంఖ్యలో పేర్లు కనబడతాయంటున్నారు. మార్చి తర్వాత ఆనం సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలు, తమ సొంతదారి చూసుకోబోతున్నారనీ, అందులో కొందరు మంత్రులు కూడా వున్నారనే ప్రచారం జరుగుతున్న దరిమిలా, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...