Switch to English

Ala Ila Ela: ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అలా ఇలా ఎలా’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Ala Ila Ela: ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు, చిత్ర టీజర్, ట్రైలర్స్ లకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎస్.కె.ఎం. ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూన్ 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి ఈ నెల 21 న విడుదల అవుతున్న అలా ఇలా ఎలా సినిమాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

అనంతరం అతిధిగా వచ్చిన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ & డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మంచి ఫ్యాన్సీ టైటిల్ తో వస్తున్న ‘అలా ఇలా ఎలా’ మూవీ బిగ్ హిట్ అయ్యి దర్శకుడికి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.

కొరియోగ్రాఫర్ అశోక్ మాట్లాడుతూ.. కళ మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు రాఘవ గారు, నిర్మాత కోల్లకుంట నాగరాజు సినిమాలో పెద్ద ప్యాడింగ్ పెట్టుకోని చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా చూశాను ఇందులో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నిర్మాత నాగరాజు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తియ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో శక్తి హీరోగా చాలా బాగా నటించాడు. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు బ్రహ్మానందం, అలీ, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్ ఇలా అందరూ చాలా అద్భుతంగా నటించారు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. జులై 21న ఎస్.కె. ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లలో విడుదల అవుతున్న “అలా ఎలా ఇలా” సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు రాఘవ ద్వారకి మాట్లాడుతూ.. కర్ణాటకలో పుట్టిన నేను చిరంజీవి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమారంగంలోకి రావడం జరిగింది. కన్నడలో 6 సినిమాలు చేశాను. తమిళ్ లో కూడా సినిమా చేశాను. తెలుగులో నాకిది మెదటి చిత్రం. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్రితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాత కొల్లకుంట నాగరాజు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచి ఈ సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి మా సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. ఈనెల 21 న విడుదల అవుతున్న మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో శక్తి వాసు మాట్లాడుతూ.. తెలుగు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకిది మొదటి చిత్రం. మంచి కాన్సెప్ట్ ఉన్న అలా ఇలా ఎలా సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు రావాలని అన్నారు.

డైలాగ్ రైటర్ రాఘవ మాట్లాడుతూ.. ఈ సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అలీ, బ్రహ్మానందంల కామెడీ చాలా హిలేరియస్ గా ఉంటుందని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శక్తి గారు హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో కూడా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ద్వారా తనకు మంచి పేరు వస్తుంది. తనతో పాటు ఇందులో నటించిన వారంతా చాలా డెడికేషన్ తో నటించారు. నిర్మాత నాగరాజు ఈ సినిమా కొరకు చాలా కష్టపడి నిర్మించారు. ఈ నెల 21 న విడుదల అవుతున్న ఈ సినిమా 250 థియటర్స్ లలో రిలీజ్ అవుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...