Switch to English

రెండో భారతీయుడికి కాజల్ మస్కా !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జాతీయ నటుడు కమల్ హాసన్ , క్రేజీ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 పైనే అందరి ఫోకస్ ఉంది. దాదాపు ఇరవైఏళ్లక్రితం వచ్చిన భారతీయుడు ఇండియన్ స్క్రీన్ పై సంచలనం రేపి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త దుమారమే రేపింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కావడంతో దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుండి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇదివరకే ఆ రేంజ్ బడ్జెట్ మేము పెట్టలేమంటూ నిర్మాతలు చేతులు ఎత్తేసారు. ఆ తరువాత కమల్ హాసన్ రాజకీయ ఎంట్రీ తో కొన్ని రోజులు ఆగింది. మరోసారి ఓ పెద్ద కంపెనీ మేము సినిమా నిర్మిస్తామంటూ ముందుకొచ్చి .. వెనక్కి తగ్గడం .. ఇలా తలనొప్పులు ఒకటి మీద ఒకటి వస్తూనే ఉన్నాయి.

శంకర్ లేటెస్ట్ సినిమా 2 .0 ఫెయిల్యూర్ దీనికి కారణం అనే వాళ్ళు లేకపోలేదు. అయితే మళ్ళీ లైకా బ్యానర్ ని లైన్ లో పెట్టిన శంకర్ ఈ సినిమాను పట్టాలు ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇకపై ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే భారతీయుడు ని ఆపేది లేదంటున్నాడు శంకర్. ఈ సినిమాలో కమల్ హాసన్ కు జోడిగా గ్లామర్ భామ కాజల్ ని ఎంపిక చేసారు. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాజల్ కు ఇలా మళ్ళీ మళ్ళీ ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురైందట. దాంతో ఈ సినిమా నుండి తప్పుకోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టుందని ప్రచారం జరుగుతుంది.

తాజగా ఈ ప్రాజెక్ట్ కు కాజల్ రాం .. రాం చెప్పిందంటూ కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. తాజాగా కాజల్ జయం రవి సరసన కోమలి అనే సినిమాలో కూడా నటిస్తుంది. దాంతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలకు సైన్ చేసిందట. ఇదంతా చూస్తుంటే కాజల్ భారతీయుడు సినిమా నుండి తప్పుకున్నట్టే అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు మాత్రం కాజల్ ఈ సినిమా నుండి తప్పుకోలేదని అంటున్నారు. సో ఈ విషయం పై కాజల్ క్లారిటీ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...