Switch to English

రఘురామకి వున్న తెగువ.. ఏపీకి చెందిన ఆ ఎంపీలలో లేదేం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

‘సెక్షన్ 124’ ఎ రద్దు కోసం రాష్ట్రాలు తమవంతు ప్రయత్నం చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన విషయం విదితమే. ఓ ఎంపీ, దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించడం దేశంలోనే చాలా అరుదైన సందర్భం అనుకోవాలేమో.

సరే, ఆయన మీద ఇదే సెక్షన్ కింద రాజద్రోహం పేరుతో అభియోగాలు మోపబడిన దరిమిలా, ఆ కేసులో అరెస్టయి, పోలీసుల నుంచి థర్డ్ డిగ్రీ టార్చర్ ఎదుర్కొన్నందున (అని ఆరోపిస్తున్నారు రఘురామ).. ఆ కేసు తాలూకు తీవ్రతనెరిగి, తన కష్టం ఇంకెవరికీ రాకూడదని రఘురామ ఈ ప్రయత్నం చేస్తుండొచ్చు. అయినాగానీ, ఇది ఓ గొప్ప ప్రయత్నం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

దేశవ్యాప్తంగా వున్న ఎంపీలందరికీ ఈ విషయాన్ని రఘురామ తెలియజేస్తున్నారు.. తనతో కలిసి ముందుకు రావాలనుకుంటున్నారు. వ్యక్తిగత హోదాలో, ఓ ఎంపీగా తనకున్న అవకాశాల్ని రఘురామ సద్వినియోగం చేసుకుంటున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరి, వైసీపీకి చెందిన మిగతా ఎంపీలు ఏం చేస్తున్నారు.? రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇలాంటివాటి విషయమై ఏనాడైనా కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు నిలదీయాల్సిన స్థాయిలో నిలదీశారా.? రాష్ట్రానికి జరిగిన అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా గట్టిగా నిలబడ్డారా.?

తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, రఘురామ మీద చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళగలరు.. అవసరమైతే ఇంకోసారి కూడా వెళ్ళడానికి సిద్ధమే. అంతకంటే ఇంకేం చేయగలరు.? రఘురామపై అనర్హత వేటు మాత్రమే వైసీపీ ఎంపీలకు ముఖ్యం. అంతే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం అస్సలు అనవసరం.

వ్యాక్సినేషన్ విషయమై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తర్వాత, ‘ఇదీ కేంద్రం మెడలు వంచడమంటే..’ అని ప్రచారం చేసుకున్నారు వైసీపీ మద్దతుదారులు. అంతకు ముందు వైఎస్ జగన్ లేఖ రాశారట.. ఆ లేఖ పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించాట.. కాదు కాదు, దెబ్బకి దిగొచ్చారట. ఎలా.? ప్రైవేటుకి వ్యాక్సిన్ వద్దని జగన్ లేఖ రాస్తే, ప్రైవేటుకి 25 శాతం వ్యాక్సిన్లు కొనసాగుతాయ్.. అని మోడీ కుండబద్దలుగొట్టేశాక.. ఇంకా ఈ అడ్డగోలు భజన ఎందుకు.?

పోనీ, మోడీ మెడలు వంచేసిన జగన్.. అన్నమాటే నిజమని అనుకుందాం. ప్రత్యేక హోదా విషయంలో కూడా వంచేయొచ్చు కదా.? సెక్షన్ 124 ఎ విషయమై రఘురామ చేస్తున్న ప్రయత్నం చాలా చాలా గొప్పది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ విషయంలో రఘురామ సక్సెస్ అయితే, ఇదే బాటలో ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటం చేయొచ్చన్న కనీస ఇంగితం రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీల్లో (వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ కూడా) లేకపోవడం శోచనీయం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఎక్కువ చదివినవి

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 మే 2024

పంచాంగం తేదీ 31- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు. తిథి: బహుళ అష్టమి ఉ.8.39 వరకు తదుపరి నవమి. నక్షత్రం: పూర్వాభాద్ర...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ..

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ ఇటివల తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ...