Switch to English

రివ్యూ: రెడ్ – థ్రిల్ చేయలేకపోయిన థ్రిల్లర్.!

Critic Rating
( 2.00 )
User Rating
( 3.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie రెడ్
Star Cast రామ్, మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్
Director కిషోర్ తిరుమల
Producer స్రవంతి రవికిశోర్
Music మణిశర్మ
Run Time 2 గంటల 26 నిముషాలు
Release జనవరి 14, 2021

ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన మరో మాస్ థ్రిల్లర్ ‘రెడ్’. ఇప్పటి వరకూ క్లాస్ చిత్రాల డైరెక్టర్ అనిపించుకున్న కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోవిడ్ టైంలో ఎలాంటి ఆఫర్స్ కి టెంప్ట్ కాకుండా, థియేటర్ రిలీజ్ వరకూ ఆగి సంక్రాంతి కానుకగా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా కుడా రామ్ మాస్ సక్సెస్ ని కంటిన్యూ చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

సిద్దార్థ్(రామ్) మరియు ఆదిత్య(రామ్)లు ఇద్దరూ ఐడెంటికల్ ట్విన్స్. కానీ చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి పడదు.. ఎవరి దారిలో వారు వెళ్లి, సిద్దార్థ్ సివిల్ ఇంజనీర్ గా ఒక మంచి లైఫ్ బ్రతుకుతూ, మహిమ(మాళవిక శర్మ)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు ఆదిత్య చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఈజీ మనీ సంపాదించేలా చిన్న చిన్న క్రైమ్స్ చేస్తుంటాడు. కట్ చేస్తే మహిమ మిస్ అవుతుంది. అలాగే ఓ మర్డర్ కేసులో సిద్దార్థ్ ని అరెస్ట్ చేస్తారు. ఆ కేసుని డీల్ చేయడం కోసం యామిని(నివేత పేతురాజ్), సంపత్ లు రంగంలోకి దిగుతారు. అలా కేసులో భాగంగా ఆదిత్య కూడా ఇందులోకి వస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? మహిమని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆదిత్య మర్డర్ చేసి ఇరికించాడా? లేక సిద్దార్థ్ ని సేవ్ చేయడం కోసం కేసులో భాగమయ్యాడా అనేది తెలియాలంటే రెడ్ చూడాల్సిందే.

తెరమీద స్టార్స్..

అటు క్లాస్ పాత్రలో, ఇటు మాస్ పాత్రలో రామ్ సూపర్బ్ గా చేసాడు. రెండు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించడం కోసం తను ఎంచుకున్న మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ లు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. స్పెషల్ గా మాస్ రోల్ అయితే బి,సి సెంటర్స్ లో బాగా కనెక్ట్ అవుతుంది. ముగ్గురు హీరోయిన్స్ లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది మాత్రం నివేత పేతురాజ్ కనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసింది. అటు క్యూట్ అండ్ మోడ్రన్ లుక్స్ లో మాళవిక శర్మ మెప్పిస్తే, అమాయకపు అమ్మాయి పాత్రలో అమృత అయ్యర్ ఆకట్టుకుంది. సంపత్ తన నెగటివ్ షేడ్స్ చూడపడంలో సక్సెస్ అయ్యాడు.

తెర వెనుక టాలెంట్..

తమిళంలో సూపర్ హిట్ అయినా తడం సినిమాకి రీమేక్ ఈ రెడ్. ఆ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే అండ్ ఫాస్ట్ నేరేషన్. కానీ ఇక్కడ బాధాకరం ఏంటంటే, ఒరిజినల్ వెర్షన్ కి హెల్ప్ అయిన రెండు పాయింట్స్ ఇక్కడ మిస్ అయ్యాయి. దాంతో సినిమాలో థ్రిల్స్ ఆడియన్స్ ని హిట్ చేయలేదు అలాగే నేరేషన్ కూడా చాలా బోరింగ్ అండ్ స్లోగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల సప్సెన్స్ థ్రిల్లర్ ని సరిగా డీల్ చేయలేకపోయారు అనేది పలు చోట్ల క్లియర్ గా అర్థమవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే పరిగెత్తే స్క్రీన్ ప్లే, అలాగే ట్విస్ట్ లు వస్తుండాలి కానీ అలా కాకుండా ఫస్ట్ హాఫ్ ని దాదాపు పాత్రల ఎస్టాబ్లిషమెంట్ కోసమే ఉపయోగించారు. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఆసక్తి కలిగించే అంశాలు లేకపోవడం బాధాకరం. సెకండాఫ్ ని కూడా చాలా డల్ గా స్టార్ట్ చేసి ఇంకా స్లోగానే నడిపించారు. చివరికి వచ్చే సరికి ఒక మోస్తరు ట్విస్ట్ లు పెట్టారు కానీ అంత స్లోగా వచ్చాక ఆ సింపుల్ ట్విస్ట్ లు ఆడియన్స్ కి హై ఫీల్ ఇవ్వడంలో హెల్ప్ కాలేదు.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన పాటలు ఓకే అనిపించాయి. డించక్ డించక్ సాంగ్ మొదట్లో వచ్చి ఊపునిస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి కాస్త హెల్ప్ అయ్యింది. సమీర్ రెడ్డి విజువల్స్ చాలా బాగా థ్రిల్లర్ మూడ్ అని అయితే క్రియేట్ చేసాయి. ఎడిటింగ్ బాలేకపోగా, ఇంకాస్త రన్ టైం ని కట్ చేసి సినిమాని స్పీడప్ చేసి ఉండచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ రేంజ్ లో ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– డ్యూయెల్ రోల్లో రామ్ సూపర్బ్ పెర్ఫార్మన్స్
– ఇంటర్వల్ బ్లాక్
– మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బోరింగ్ మోమెంట్స్:

– నో థ్రిల్స్, నో సస్పెన్స్
– రైటింగ్ సరిగా లేకపోవడం
– అనవసరంగా వేసిన సబ్ ప్లాట్స్
– స్లో నేరేషన్
– వీక్ డైరెక్షన్

విశ్లేషణ:

మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫీల్ అండ్ లుక్ లో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రెడ్’, అటు సస్పెన్స్ లేక, ఇటు థ్రిల్స్ లేక స్లో నేరేషన్ తో బోర్ కొట్టించేసారు. రామ్ డ్యూయెల్ రోల్లో మంచి నటనని కనబరిచి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నా, సినిమాలో సరైన కథ, కథనం లేనందున ఆడియన్స్ డిస్కనెట్ అయిపోతారు. సూపర్ హిట్ తమిళ సినిమా ‘తడం’ కి రీమేక్ గా వచ్చిన ‘రెడ్’ తెలుగులో ఆ రేంజ్ విజయాన్ని అందుకోవడంలో విఫలమైందని చెప్పచ్చు.

చూడాలా? వద్దా?: ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చుసిన రామ్ ఫాన్స్ మాత్రం ట్రై చేయచ్చు.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...