Switch to English

ఓటిటి రివ్యూ: ఇట్స్ టైం టు పార్టీ – ఇదొక టార్చర్.!

Critic Rating
( 1.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie ఇట్స్ టైం టు పార్టీ
Star Cast శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దపల్లి, బాషా మొహిద్దీన్
Director గౌతమ్ ఈవీఎస్
Producer అల్లం సుభాష్, గౌతమ్
Music శేఖర్ మోపూరి
Run Time 1 గంట 59 నిముషాలు
Release డిసెంబర్ 24, 2020

ఫేమస్ యాంకర్, యాక్టర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దపల్లి, బాషా మొహిద్దీన్ లు నటించిన సినిమా ‘ఇట్స్ టైం టు పార్టీ’. గౌతమ్ ఈవీఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా రోజులుగా రిలీజ్ కి నోచుకోలేదు. ఫైనల్ గా ఈ సినిమాని ఓటిటి ద్వారా రిలీజ్ చేశారు. అది కూడా ఫ్రీ యాప్ అయిన ఎంఎక్స్ ప్లేయర్ లో రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

లైఫ్ లో ఫ్రీడమ్ ఉండాలని ప్రేమ, పెళ్ళికి దూరంగా రోజుకొకరితో లైఫ్ ఎంజాయ్ చేసే డాక్టర్ ప్రియాన్ష(దితిప్రియ భట్టాచార్య). ఈ రోజు ప్రేమ, రేపు సెక్స్, ఎల్లుండి బ్రేకప్ చెప్పే రోజుల్లో ప్యూర్ లవ్ కోసం వెయిట్ చేసే అమ్మాయి ఆకాంక్ష(మాయ నెల్లూరి). అటు కెరీర్లో గ్రోత్ లేక, ఎంత ట్రై చేసిన పెళ్లి కాక ఫ్రస్ట్రేట్ అవుతున్న అబ్బాయి రవి(క్రిష్ సిద్దపల్లి). ఈ ముగ్గురూ జీవితంలో పలు సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్స్ తో ఉన్న టైంలో వీరందరూ ఆన్లైన్ డేటింగ్ ఆప్ ‘టచ్’ లోకి ఎంటర్ అవుతారు. ఆ యాప్ ద్వారా గోవాలో ఓ పార్టీ ఎంజాయ్ చేయడానికి బయలుదేరుతారు. గోవాలో అనుకోకుండా కలిసిన ఈ ముగ్గురికి ఆ టచ్ యాప్ పార్టీ గురించి తెలిసిన నిజానిజాలేమిటి? అసలా టచ్ యాప్ ఎవరు ఎందుకు రన్ చేస్తున్నారు? ఆ టచ్ యాప్ వీరి జీవితాల్లో తీసుకొచ్చిన మా ర్పులేమిటి? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

ఈ సినిమాలో తెలిసిన నటులంటే శ్రీముఖి మరియు మాయ నెల్లూరి. శ్రీముఖి ఉన్న స్క్రీన్ టైం చాలా తక్కువ కానీ ఉన్నంతలో ఓకే అనిపించింది. దితిప్రియ భట్టాచార్యలో గ్లామర్ డోస్ తప్ప పెర్ఫార్మన్స్ లేదు. మాయ నెల్లూరి నటన కూడా అంతంత మాత్రమే. హావభావాలు పలకని హీరో మన క్రిష్ సిద్దపల్లి. విట్టల్ పాత్ర చేసిన బాషా మొహిద్దీన్ పెర్ఫార్మన్స్ అంతంతమాత్రమే అయినా కాస్త వాయిస్ లో కామెడీ టైమింగ్ ఉండడం వలన ఓకే అనిపిస్తాడు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన, భలే చేశారని చెప్పుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా లేదు. మరీ అంతగా చెప్పాలంటే, డైరెక్టర్ గౌతమ్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ ఒక్కటే బాగుంది కానీ కథ, ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి అనుకున్నది ఒకటి, తీసింది ఇంకొకటి అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ డైరెక్టర్ గౌతమ్. ఇక మిగతా డిపార్ట్మెంట్స్ ని పేరు పేరునా వరస్ట్ అని చెప్పుకునేదానికన్నా అందరూ కలిసి సినిమాని మూసినదిలో ముంచేశారని చెప్పుకోవచ్చు.

విజిల్ మోమెంట్స్:

– బేసిక్ స్టోరీ లైన్
– శ్రీముఖి అనే పేరు

బోరింగ్ మోమెంట్స్:

– కథ నుంచి అవుట్ ఫుట్ వరకూ అన్నీ మైనస్ లే

విశ్లేషణ:

సినిమా టైటిల్ ఏమో ‘ఇట్స్ టైం టు పార్టీ’ కానీ సినిమా చూస్తే ఏమో ఇదొక టార్చర్ అనకుండా ఉండలేం, ఇంకా సినిమాలో వాడిన ఓ డైలాగ్ ప్రకారం ఇదొక పెద్ద రాడ్ అంట అని కూడా చెప్పచ్చు.. శ్రీముఖి ఫేమ్ ని వాడుకొని పోస్టర్స్ ట్రైలర్స్ ప్రమోట్ చేశారు కానీ ఆమె సినిమాలో ఉండేది చాలా అంటే చాలా తక్కువ సేపు. అలా అని ఉన్న ఎపిసోడ్ ఏమీ బాగుండదులెండి. ఓవరాల్ గా ఈ పార్టీకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది.

చూడాలా? వద్దా?: పిచ్చ లైట్ సినిమా.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...