Switch to English

ఓటిటి రివ్యూ: దుర్గామతి – ఒరిజినల్ వెర్షన్ అంత లేదు, జస్ట్ యావరేజ్.!

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie దుర్గామతి
Star Cast భూమి పెడ్నేకర్, అర్షద్ వర్షి, జిష్షు షేన్ గుప్త
Director జి. అశోక్
Producer విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్, అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్
Music జేక్స్ బెజోయ్
Run Time 2 గంటల 35 నిముషాలు
Release డిసెంబర్ 11, 2020

2018లో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘భాగమతి’ సినిమాని దాదాపు రెండేళ్ల తర్వాత హిందీలో ‘దుర్గామతి’గా తెరకెక్కించారు. తెలుగులో డైరెక్ట్ చేసిన అశోక్ హిందీలో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అనుష్క పోషించిన పాత్రని హిందీలో భూమి పెడ్నేకర్ పోషించింది. కోవిడ్ పాండెమిక్ వలన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో నేడు విడుదలైంది. హిందీలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రజల కోసమే అహర్నిశలు పనిచేసే మంత్రి ఈశ్వర్ ప్రసాద్(అర్షద్ వర్షి).. బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న పురాతన దేవాలయాల నుంచి విగ్రహాలు మాయం అవుతుంటాయి. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈశ్వర్ ప్రసాద్ 15 రోజుల్లో ఆ కేసు సాల్వ్ చెయ్యాలి లేదా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా అని శబదం చేస్తాడు. ఈశ్వర్ ప్రసాద్ అంటే పడని మంత్రులు అతని ఇమేజ్ ని బాడ్ చేయాలనుకుంటారు. అందులో భాగంగా సీబీఐ ఆఫీసర్ నిధి వర్మ(మహి గిల్)ని రంగంలోకి దింపుతారు. తను మొదటగా ఈశ్వర్ ప్రసాద్ తో కలిసి పదేళ్లు పని చేసి, మర్డర్ కేసులో జైల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ చంచల్ చౌహన్(భూమి పెడ్నేకర్) నుంచి నిజాలు రాబట్టాలనుకుంటుంది. అందుకోసం చంచల్ ని సీక్రెట్ గా దుర్గా మహాల్లో పెడతారు. అప్పటి వరకూ నార్మల్ గా ఉన్న చంచల్ ఒక్కసారిగా దుర్గామతిగా మారుతుంది. అక్కడి నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. ఇంతకీ అసలు దుర్గామతి ఎవరు? దుర్గామతి కథ ఏంటి? అసలు ఆ ఈశ్వర్ ప్రసాద్ మంచివాడా? చెడ్డవాడా? చంచల్ ఎందుకు జైల్లో ఉంది? అనే ప్రశ్నలకి సమాధానమే దుర్గామతి.

తెర మీద స్టార్స్..

భూమి పెడ్నేకర్ మొదటిసారి ఇలాంటి ఓ బలమైన పాత్ర పోషించింది. అందరూ అంత హెవీ పెర్ఫార్మన్స్ ఓరియంటెడ్ పాత్రలో ఎలా చేస్తుందో అనుకున్నారు కానీ, తన వరకూ అద్భుతమైన నటనని కనబరిచింది. అటు ఐఏఎస్ ఆఫీసర్ గా, అమాయకురాలిగా, దుర్గామతిగా ఇలా మూడు విభిన్న షేడ్స్ లో సూపర్బ్ గా నటించింది. హిందీ వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, కానీ తెలుగు చూసిన వారికి మాత్రం అనుష్క కటౌట్ వలన ఆ పాత్రలో గాంభీర్యం బాగా రీచ్ అయ్యింది. కానీ ఇక్కడ భూమి కటౌట్ చిన్నది కావడం వలన దుర్గామతి సీన్స్ తెలుగులో వర్కౌట్ అయినంతగా వర్కౌట్ కాలేదు అనిపిస్తుంది. కామెడీ పాత్రల్లో కనిపించే అర్షద్ వర్షి సెటిల్డ్ నెగటివ్ షేడ్స్ లో బాగా నటించాడు. మహి గిల్, జిష్షు షేన్ గుప్త, ధన్ రాజ్ లాంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా తెలుగులో డైరెక్ట్ చేసిన జి. అశోక్ హిందీలోనూ డైరెక్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ ఆయనే తీశారు కాబట్టి రీమేక్ చేస్తున్నప్పుడు తప్పులను సరిచేసుకుంటూ, ఇంకా బెటర్ గా తీయాలి కానీ అలా తీసినట్టు అనిపించలేదు.. బడ్జెట్ వలన సెట్ లో బాగా మార్పులు కనిపించాయే తప్ప కథలో, తీయడంలో మార్పులు కనిపించకపోగా చాలా చోట్ల ఒరిజినల్ కంటే ఇంకా వీక్ గా తీశారు. లవ్ ట్రాక్ అంతగా వర్కౌట్ కాలేదు, సీన్స్ లో పర్ఫెక్షన్ లేకుండా చేశారు. ఒరిజినల్ వెర్షన్ సూపర్ హిట్ టాక్ రేంజ్ అయితే, ఇది జస్ట్ యావరేజ్ అనేలా ఉంది. దీన్నిబట్టే చెప్పచ్చు అయన ఎంత శ్రద్ధతో ఈ సినిమాని రీమేక్ చేశారో చెప్పడానికి..

కుల్దీప్ మామణియా విజువల్స్ చాలా బాగున్నాయి, ఆ విజువల్స్ ని హైలైట్ చేసేలా జేక్స్ బెజోయ్ నేపధ్య సంగీతం ఉంది. చాలా చోట్ల మ్యూజిక్ అండ్ విజువల్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. ఆర్ట్ వర్క్స్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్.

విజిల్ మోమెంట్స్:

– భూమి పెడ్నేకర్ నటన
– ఇంటర్వల్ అండ్ పోస్ట్ ఇంటర్వల్ ఎపిసోడ్స్
– క్లైమాక్స్ థ్రిల్స్
– నేపధ్య సంగీతం + విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:

– లవ్ ట్రాక్ లో ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం
– సస్పెన్స్ మిస్ అవ్వడం
– రన్ టైం
– సాగదీస్తున్నట్టు అనిపించే సీన్స్
– పసలేని విలనిజం
– చాలా ఓల్డ్ గా అనిపించే కొన్ని సీన్స్

విశ్లేషణ:

తెలుగు నుంచి హిందీకి వెళ్లిన ఈ ‘దుర్గామతి’ అక్కడి ప్రేక్షకులను కొంతవరకూ థ్రిల్ చేయగలిగిందనే చెప్పాలి. కానీ తెలుగు చూసిన వారికి పెద్దగా నచ్చదు. కొన్ని విజువల్స్ బాగా తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ కొన్ని సీన్స్ ని మాత్రం చాలా నామమాత్రంగా చేసాడు, అందుకే చాలా చోట్ల నీరసం వస్తుంది. ఓవరాల్ గా దుర్గామహాల్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నా మిగతా అంతా బోరింగ్ గా సాగుతూ జస్ట్ పరవాలేదు అనిపించుకుంటుంది.

చూడాలా? వద్దా?: వేరే ఏ సినిమా లేకపోతే, హారర్ ఇష్టపడే హిందీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...