Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: హస్తిన వెళ్ళొచ్చినారు.. ఏం సాధించినారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారు ఈ పర్యటనలో. ఓ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం మామూలే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడం మామూలే. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడమంటే.. ఆ పర్యటన తాలూకు ‘సారాంశం’ ఏంటి.? ఆ పర్యటన వల్ల రాష్ట్రానికి కలిగిన లాభమేంటి.? అని సగటు ప్రజానీకం చర్చించుకోకుండా వుంటారా.?

మరి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి చోటు చేసుకున్న ‘సానుకూల’ పరిణామాలేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద వుంటుంది కదా.! జీఎస్టీ బకాయలు సహా, రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా నిధులు రావాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన చెల్లింపులూ ఇందులో వున్నాయి. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన ‘రెవెన్యూ లోటు’ వంటివీ వున్నాయి. రాజధానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన వెయ్యి కోట్ల గురించీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

తాజాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బేటీ అయ్యారు. ఇంతకీ, ఈ భేటీలతో ఏం తేలినట్లు.? కేంద్రం, రాష్ట్రం సమర్పించిన ‘వినతుల’ పట్ల ఎలా స్పంచింది.? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు.

‘కరోనా నేపథ్యంలో కేంద్రం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. జీఎస్టీ బకాయిల చెల్లింపు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. కేంద్రాన్ని అర్థం చేసుకోవడం మంచిదే. కానీ, రాష్ట్రం పరిస్థితి ఏంటి.? ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి, తాను కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం ద్వారా.. రాష్ట్రానికి ఈ మేలు జరిగిందని చెప్పుకోలేకపోవడం పట్ల రకరకాల ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.

మరోపక్క, ‘తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతతో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవలేదు..’ అని టీడీపీ ఎద్దేవా చేస్తోన్న విషయం విదితమే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...