Switch to English

స్పెషల్ స్టోరీ: కరోనా కల్లోలంతో పత్రికా సిబ్బందికి ఎంత కష్టం.. ఎంత కష్టం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారితో అన్ని రంగాలవారూ ఇబ్బంది పడుతున్నా.. పత్రికా సిబ్బంది పాట్లు మాత్రం ఎవరికీ ఉండవు. ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ వారధిలో ఉండే పాత్రికేయులు వృత్తి ధర్మంలో భాగంగా కరోనా కల్లోలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేయక తప్పలేదు. ఇంత చేసినా వారికి రావాల్సిన గుర్తింపు కొంచెం కూడా లేదు. కరోనా యోధులుగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల గురించే ప్రస్తావిస్తారు తప్ప.. వారితో సమానంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులు ఎవరికీ పట్టరు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది పత్రికా సిబ్బంది కరోనా బారిన పడగా.. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. సహచరులు ఈ మహమ్మారి బారిన పడుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నా.. ఏదో ఒక సమయంలో తమకూ ఆ పరిస్థితి తప్పదని తెలిసినా.. కార్యక్షేత్రంలో ముందుకెళ్లడం తప్ప చేసేదేమీ లేదని వారికి తెలుసు. ఎందుకంటే ఆ కొలువుంటేనే నోట్లోకి నాలుగు వేళ్లు కాకపోయినా కనీసం రెండు వేళ్లయినా వెళతాయనే కఠోర సత్యం కళ్ల ముందు కదలాడుతుంది కాబట్టి. ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు అన్ని సంస్థలూ వేతనాల్లో కోతేశాయి. పలు సంస్థలు చాలామందిని తొలగించాయి.

ఒక్క ఈనాడులోనే ఎడిటోరియల్ సిబ్బంది మినహా యాడ్స్, సర్క్యులేషన్, మార్కెటింగ్, సెక్యూరిటీ సహా పలు విభాగాల్లో దాదాపు 400 మందిని తొలగించినట్టు సమాచారం. ఎడిటోరియల్ విభాగానికి వస్తే రిటైర్ అయిపోయి ఎక్స్ టెన్షన్ మీద కొనసాగుతున్నవారిని సాగనంపేశారు. మిగిలినవారి విషయంలో లేఆఫ్ ప్రకటించి.. కార్యాలయానికి ఎన్నిరోజులు రావాలో నిర్దేశించి, ఆ మేరకే వేతనాలు ఇస్తున్నారు. ఇది కూడా ఎంతకాలం కొనసాగుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు తమను వద్దని చెప్పేస్తారో అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

సాక్షిలో ప్రస్తుతానికి వేతనాల కోత, ఉద్యోగుల తొలగింపు లేకపోయినా.. త్వరలోనే దాదాపు 30 శాతం సిబ్బందిని కుదించే అవకాశం ఉందనే ప్రచారం చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి అలాంటిది ఏమీ జరిగే అవకాశం లేదని పలువురు అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే కరోనా కబళించే అవకాశమున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో పలు ప్రతికల్లోని సిబ్బంది భయంభయంగానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే.. ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు పాత్రికేయులను మరింత కుంగదీస్తున్నాయి. కేవలం వార్తా సేకరణకే పరిమితమైన రిపోర్టర్లకు యాడ్ టార్గెట్స్ ఇవ్వడమే కాకుండా వాటిని తెచ్చినవారికే వేతనాలు లేదా డేట్ లైన్ లు ఇస్తామనే వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

నిజానికి ఇలా యాడ్స్ తేవాలనే టార్గెట్ చిన్నపత్రికలకే ఉండేది. కానీ గత కొంతకాలంగా పెద్ద పత్రికలకూ వ్యాపించింది. వార్షికోత్సవానికి యాడ్స్ తీసుకురావాలని స్టాఫర్లకు కూడా టార్గెట్ విధించడం సాధారణమైపోయింది. ఎడ్వర్టైజింగ్ విభాగం చేయాల్సిన పనిని రిపోర్టర్లకు అప్పగించడం.. విధి లేని పరిస్థితుల్లో వారు చేయాల్సి రావడం ఎప్పటినుంచో జరుగుతోంది.

తాజాగా దీనికి సంబంధించి ఓ పత్రికలో పనిచేసే రిపోర్టర్ సోషల్ మీడియా సాక్షిగా తన ఆవేదన వ్యక్తంచేశారు. తమ యాజమాన్యం కరోనా కల్లోలంలోనూ యాడ్స్ టార్గెట్ ఇవ్వడం.. వాటిని తెచ్చినవారికే డేట్ లైన్ కొనసాగిస్తామని హెచ్చరించడం.. అలాగే జిల్లా బ్యూరో చీఫ్ కూడా టార్గెట్ ఇవ్వడం.. అందుకోసం ఆయన నానా పాట్లు పడీ ఎలా పూర్తిచేశారో అన్నీ వివరించారు.

అయితే, అంతటితో వదిలిపెట్టకుండా వార్షికోత్సవం యాడ్స్ తీసుకురావాలని మళ్లీ టార్గెట్ పెట్టడం.. ఇందుకోసం బెదిరింపులు, హెచ్చరికలు ఎలా సాగాయో పూసగుచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆ బ్యూరో చీఫ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క పత్రికే కాదు.. దాదాపు అన్ని పత్రికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది.

ఒకప్పుడు కేవలం చిన్న పత్రికలకే పరిమితమైన ఈ పద్దతి.. క్రమంగా ప్రధాన పత్రికలకూ పాకడమే విడ్డూరం. ఇప్పటికే రిపోర్టర్లపై స్టోరీల గురించి ఒత్తిడి ఉండగా.. తాజాగా కొన్ని పత్రికలు ఫొటోగ్రాఫర్లకు కూడా మంగళం పాడేసి, ఆ బాధ్యతలను కొన్నిసార్లు వారికే అప్పగిస్తున్నాయి. ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో యాడ్స్ టార్గెట్లు అదనం. ఇక పాత్రికేయుల పరిస్థితి ఇలా ఉంటే యాడ్ విభాగంలో పనిచేసేవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

సాధారణ సమయంలోనే యాడ్స్ కోసం వారు తిరుగుతూ ఉండాలి. కరోనా సమయంలో ఇది అంత సులభమైన టాస్క్ కాదు. పైగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో యాడ్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో వారిపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీరి ఉద్యోగాలు కూడా సంస్థలు తొలగించాయి. పది మంది చేసే పనిని ఇద్దరు ముగ్గురికే అప్పగించింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఎలాగోలా చేయొచ్చు.. కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ ఒత్తిడిని వారు తట్టుకోలేకపోతున్నారు.

ఈ సందర్భంలో శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తుకురాక మానవు. ‘కూటి కోసం ఆత్మతృప్తి కోసం.. పాత్రికేయుడిగా బతుకుదామని.. పత్రికలో చేరిన రిపోర్టర్ కి ఎంత కష్టం ఎంత కష్టం.. యాడ్స్ కోసం దిగులుపడుతూ దీనుడౌతూ వీధి వీధి తిరగడం ఎంత కష్టం ఎంత కష్టం.. అసలు పని పక్కకొదిలి కొసరు పనికి పాకులాడే నేటి పాత్రికేయుడికి ఎంత కష్టం ఎంత కష్టం?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...