Switch to English

‘రాజుగారి’ ర్యాగింగ్‌.. వైఎస్సార్సీపీకి ఆ మాత్రం ధైర్యం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టీడీపీపైనో, జనసేన పార్టీ పైనో విమర్శిస్తూ మాట్లాడాలంటే గుంపులు గుంపులుగా దూసుకొచ్చేస్తారు వైసీపీ నేతలు. అదే భారతీయ జనతా పార్టీని విమర్శించాలంటే మాత్రం ఒక్కరంటే ఒక్కరికీ ధైర్యం సరిపోవడంలేదు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో. ఇంతకీ, బీజేపీని విమర్శించడానికి వైఎస్సార్సాపీకి అంత భయమెందుకు.? ఏమోగానీ, ఈ ఒక్క ‘పాయింట్‌’ పట్టుకునే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీపై ‘తిరుగుబాటు బావుటా’ ఎగురవేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

‘నేను ముఖ్యమంత్రి పట్ల విధేయుడ్ని.. ఆయనంటే నాకు అపారమైన ప్రేమ, గౌరవం..’ అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నా, తమ పార్టీ పట్ల, తమ ప్రభుత్వం పట్ల ఆయన వ్యవహారశౖలి అందరికీ అర్థమవుతూనే వుంది. ఇప్పటికే షోకాజ్‌ నోటీస్‌ అందుకున్న రఘురామకృష్ణరాజు, ఆ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిన విజయసాయిరెడ్డికి ఏ స్థాయిలో కౌంటర్‌ ఇవ్వాలో.. ఆ స్థాయిలో ఇచ్చేసిన విషయం విదితమే. నిన్ననే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరుతూ ఓ లేఖాస్త్రాన్ని కూడా సంధించారు రఘురామకృష్ణరాజు.

మరోపక్క, నిన్న ఓ ఆడియో సాంగ్‌ని ప్రధాని మోడీకి అనుకూలంగా వదిలిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఏకంగా ఓ వీడియో సాంగ్‌ని కూడా విడుదల చేయడం గమనార్హం. బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అయితే, రాజుగారి వాదన ఇంకోలా వుంది. ‘చైనా – భారత్‌ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీకి ఓ ఎంపీగా తాను అండగా వుండాల్సిన బాధ్యత వుందనీ.. అది భారతీయుడిగా తన బాధ్యత అనీ’ చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. ఆ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రఘురామకృష్ణరాజు మీద తూతూ మంత్రంగా విమర్శలు చేసి ఊరుకున్నారుగానీ, ఎక్కడా ఇంతవరకు బీజేపీని విమర్శించలేకపోయారు.

మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా వుండే విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌పై ఒక్క ట్వీట్‌ కూడా వేయలేకపోవడం.. బీజేపీ పట్ల ఆయనకున్న భక్తికి నిదర్శనమా.? భయానికి నిదర్శనమా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ గనుక బీజేపీని విమర్శించడం మొదలు పెడితే, ఆ తర్వాత అసలు సిసలు యాక్షన్‌ షురూ చేయాలని బీజేపీ అధిష్టానం కూడా భావిస్తోందట. అది తెలుసుగనకనే బీజేపీ విషయంలో వైసీపీ కిమ్మనకుండా ‘కుక్కిన పేనులా’ వ్యవహరిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...