Switch to English

అధికార పీఠం అప్పగించేది అతివలే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇక మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. సభలు, సమావేశాలు, నేతల హామీలు, విమర్శలు, ప్రతివిమర్శలకు 9వ తేదీ సాయంత్రంతో తెరపడనుంది. గురువారం జరిగే పోలింగ్ లో ఓటర్లు ఏ పార్టీని గద్దెనెక్కించాలో, ఏ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేయాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తమ తీర్పును నిక్షిప్తం చేస్తారు. తర్వాత మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు అధికారం ఎవరిది అనే అంశంపై ఉత్కంఠ తప్పదు.

ఇదంతా అలా పక్కన పెడితే.. ఈ సారి ఎంత మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నారు? ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు వంటి వివరాలు పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈసారి నేతల భవితవ్యం మహిళా శక్తి చేతిలోనే ఉంది. అధికార పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే విషయం అతివలే నిర్ణయించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనం. రెండు జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో అతివల ఓట్లే అధికం. గతనెల 25 నాటికి ఉన్న ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,94,62,339 మంది పురుషులు, 1,98,77,421 మంది మహిళలు, 3,957 మంది ఇతరులు (థర్డ్ జెండర్) ఉన్నారు. మొత్తమ్మీద 4,15,082 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.

శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 21,75,176 మంది ఓటర్లు ఉండగా.. 10,88,410 మంది పురుషులు 10,86,493 మంది మహిళలు, 273 మంది ఇతరులు ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే.. 32,39,517 మంది ఓటర్లలో 16,25,192 మంది పురుషులు, 16,14,071 మంది మహిళలు, 254 మంది ఇతరులు ఉన్నారు. ఈ రెండు జిల్లాలూ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మహిళలనే ప్రభావం చూపనున్నారు. అంటే ఈసారి ఎవరిని గద్దెనిక్కించాలనే అంశం అతివల చేతిలోనే ఉందన్నమాట.

ఈ నేపథ్యంలోనే పార్టీలు రైతులతోపాటు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం కింద డబ్బులు వేస్తుండగా, మళ్లీ అధికారంలోకి వస్తే కోటి మంది మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలు ప్రకటించారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15 వేల మొత్తం ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా సున్నా శాతం వడ్డీకే మళ్లీ రుణాలిస్తామని ప్రకటించారు. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరిని గద్దెనెక్కిస్తారు? చంద్రబాబుకు బాసటగా నిలుస్తారా? లేక జగన్ పథకాలకు జైకొడతారా అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రులు వీళ్లే.. 17మంది కొత్తవారు..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా.. రాజకీయ జీవితంలో నాలుగోసారి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

Delhi Police: ‘అది చిరుతపులి కాదు..’ ఢిల్లీ పోలీసులు ఏమన్నారంటే..

Delhi Police: రాజధాని ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆదివారం జరిగిన కేంద్ర కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ జంతువులాంటి ఆకారం కనిపించిన సంగతి తెలిసిందే....

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని ఓ యూనివర్శిటీలో...