Switch to English

‘రెడ్డి వర్సెస్‌ కమ్మ’ – ఏపీలో ఈ వైరస్‌కి మందు లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మొన్నామధ్య ఓ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని ఉద్దేశించి, ‘ఆరోగ్యశ్రీలో అన్నిటికీ మందు వుందిగానీ.. పచ్చ రాజకీయ అక్కసుకి మందు, చికిత్స లేవు’ అని సెలవిచ్చారు. ఆ సంగతేమోగానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం అంతా ముక్త కంఠంతో ఒకటే నినదిస్తున్నారు.. ‘ఈ వైరస్‌కి మందు లేదు’ అని. ఇక్కడ ‘వైరస్‌’ అంటే కరోనా వైరస్‌ కాదు. కరోనా వైరస్‌కి కూడా రేపో మాపో మందు ఖచ్చితంగా దొరికేస్తుంది.. ఆ పనిలోనే బిజీగా వున్నారు శాస్త్రవేత్తలు.

కానీ, రాష్ట్రానికి పట్టిన వైరస్‌కి మాత్రం మందూ లేదు, చికిత్స కూడా వుండదు. ఎందుకంటే, ఇది ఆషామాషీ వైరస్‌ కాదు. ఈ వైరస్‌ పేరు ‘కులం’. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని జాడ్యం ఇది. నిజానికి, దేశ వ్యాప్తంగా అనేక కులాలున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కులాలు మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనవి.

అన్నట్టు, తెలంగాణలోనూ దాదాపు అవే కులాలు వున్నా, ‘కుల రాజకీయం’ అనే వైరస్‌కి తెలంగాణలో చోటు లేదు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఈ ‘కుల రాజకీయం’ అనే వైరస్‌ని పెంచి పోషిస్తోంది. ఇది ప్రజలకు పెను శాపంగా మారుతోంది. ‘టీడీపీ వర్సెస్‌ వైపీపీ’ కాస్తా ‘కమ్మ వర్సెస్‌ రెడ్డి’ అన్నట్లు తయారైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అన్నట్టు, వైఎస్‌ జగన్‌ క్రిస్టియన్‌ గనుక, ఆయనకు ‘రెడ్డి’ అనే కులం ‘ట్యాగ్‌’ వర్తిస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

ఎన్నికలు కులాల ప్రాతిపదికన జరుగుతున్నాయి.. పదవులు కులాల ప్రాతిపదికన పంచుతున్నారు.. ఇవి చాలక, ఇప్పుడు ఆ కులాల పేరు చెప్పి నిస్సిగ్గుగా తిట్టుకుంటున్నారు.. రోడ్డున పడుతున్నారు. మొన్న అమరావతి ఉద్యమం జరిగితే, అది ‘కమ్మ’ ఉద్యమం అన్నారు. ఇప్పుడు అదే అమరావతిలో వైసీపీ రాజేసిన ఇంకో పెయిడ్‌ ఉద్యమాన్ని ‘రెడ్డి’ ఉద్యమం అని ఎందుకు అనకూడదు.? మూడు రాజధానుల నిర్ణయాన్ని ‘రెడ్డి రాజకీయం’ అని ఎందుకు అనకూడదు.?

ఏం, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు కులాలు మాత్రమే వున్నాయా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన రాష్ట్రంలో ఈ కుల రాజకీయాలు జరుగుతున్నాయి. నిజానికి, ప్రజలెవరూ ఈ కులాల వైరస్‌తో కొట్టుకు రావడంలేదు. కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులు మాత్రమే, కులం పేరు చెప్పి రాజకీయం చేస్తుండడం దురదృష్టకరం.

ఆఖరికి ముఖ్యమంత్రి కూడా కులం పేరు చెప్పి ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మీద ఆరోపణలు చేయడం అత్యంత హేయం. రేప్పొద్దున్న అధికారుల్ని ఈ కులాల వారీగా విభజించి ఆరోపణలు చేస్తే ఏంటి పరిస్థితి.? పొరుగు రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి చూసి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌.. ‘కసి’ పెంచుకుని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాల్సింది పోయి.. కులం పేరుతో మరింత పతనానికి గురవుతోంటే.. రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు.?

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...