Switch to English

కీడా కోలా మూవీ రివ్యూ: పర్వాలేదనిపించే క్రైమ్ డ్రామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie కీడా కోలా
Star Cast రఘు రామ్, చైతన్య, తరుణ్ భాస్కర్
Director తరుణ్ భాస్కర్ దాస్యం
Producer సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు
Music వివేక్ సాగర్
Run Time 2 గం 15 నిమి
Release నవంబర్ 3, 2023

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో తనకంటూ డీసెంట్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు తరుణ్ భాస్కర్. తన నుండి ఐదేళ్ల తర్వాత వచ్చిన చిత్రం కీడా కోలా. ప్రోమోల దగ్గరనుండి ఒక భిన్నమైన డ్రామాగా ఈ చిత్రం అనిపించింది. చైతన్య రావు, రాగ్ మయూర్, జీవన్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు నటించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కీడా కోలా ఎలా ఉందో చూద్దామా.

కథ:

కీడా కోలా అనేది రెండు గ్రూపులకు సంబంధించిన కథ. తాత (బ్రహ్మానందం), వాస్తు (చైతన్య రావు), లంచం అలియాస్ కౌశిక్ (రాగ్ మయూర్) మరియు నాయుడు (తరుణ్ భాస్కర్), జీవన్ (జీవన్ కుమార్), సికందర్ (విష్ణు ఓయ్) లకు వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల డబ్బు కావాలి.

అయితే జీవితాలు సెటిల్ అయిపోయే డబ్బు కోసం ఈ రెండు గ్రూపులు కలిసి వచ్చి కూల్ డ్రింక్ లో బొద్దింకను ఎందుకు వేయాల్సి వచ్చింది? దీని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి?

నటీనటులు:

చైతన్య రావు ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేసినట్లుగా ప్రమోట్ చేసారు కానీ నిజానికి తరుణ్ భాస్కర్ రోల్ మెయిన్ లీడ్ ఈ చిత్రానికి. పెర్ఫార్మన్స్ పరంగా నాయుడు పాత్రలో తరుణ్ చాలా బాగా చేసాడనే చెప్పాలి. తన కామెడీ టైమింగ్ సూపర్బ్. ఇక మిగిలిన అన్ని పాత్రల్లోకి రాగ్ మయూర్, విష్ణు ఓయ్, జీవన్ కుమార్ ల పాత్రలు సూపర్బ్ గా ఎలివేట్ అవుతాయి. ఇక వాస్తు పాత్రలో చైతన్య రావు బాగానే చేసాడు కానీ కెరీర్ ను మార్చే లాంటి పాత్ర అయితే కాదు.

ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ చిత్రంలో నటిస్తున్నాడు అంటే చాలానే అంచనాలు ఉన్నాయి కానీ తన పాత్ర అంత ప్రాముఖ్యమైంది కాదు దాని చుట్టూ అంత కామెడీ కూడా పుట్టలేదు. ఇక మిగిలిన పాత్రధారులు అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

టెక్నికల్ గా తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఈ చిత్ర కథ చాలా చాలా వీక్. ట్రీట్మెంట్ అదీ కొత్తగా ఉండాలన్న తాపత్రయంలో తరుణ్ భాస్కర్ కథను పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. తన స్క్రీన్ ప్లే కూడా టాప్ గా ఏం లేదు. కొన్ని అద్భుతమైన కామెడీ సీన్లు ఈ చిత్రంలో ఉన్నాయి, అలాగే అన్నే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ఇక ఒక సీన్ తర్వాత ఒక సీన్ వచ్చే విషయంలో కూడా నిలకడ లేనట్లుగా అనిపిస్తుంది.

ఇక్కడ తరుణ్ భాస్కర్ టాలెంట్ ను తక్కువ చేయడానికేం లేదు. కానీ ముందు రెండు సినిమాల రేంజ్ లో పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ను అందించలేకపోయాడు అన్నది వాస్తవం. ట్రీట్మెంట్ బాగానే ఉన్నా మెయిన్ కథ అస్సలు లేకపోవడంతో మొత్తం నీరుగారిపోయింది.

ఇక తరుణ్ భాస్కర్ సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఒకటి. వివేక్ సాగర్ పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే క్రేజీ లెవెల్లో వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు ఓ స్థాయి వరకూ ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • తరుణ్ భాస్కర్ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సంభాషణలు
  • మిగతా నటీనటుల పెరఫార్మన్స్ లు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కథ లేకపోవడం
  • స్క్రీన్ ప్లే
  • బ్రహ్మానందంను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం
  • క్లైమాక్స్

చివరిగా:

మొత్తానికి కీడా కోలా పర్వాలేదనిపించే ఒక క్రైమ్ కామెడీ సినిమా. తరుణ్ భాస్కర్ నటుడిగా రాణించాడు కానీ కథకుడిగా నిరుత్సాహపరిచాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది స్థాయిలో కీడా కోలా లేదు కానీ మరీ నిరుత్సాహపరిచే సినిమా అయితే కాదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...