Switch to English

ట్రయల్ మూవీ టీజర్ లాంచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ది ట్రయల్’. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు నిర్మాతలు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్నీ మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు. మేము ఒక చిన్న సినిమా తీద్దాం అనుకున్నాం. ఒక ప్రయత్నం చేశాం. మా నిర్మాతగారికి కథ నెరేట్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఈ కథ కంటే ముందు నిన్ను నమ్ముతున్నాను అని. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా.. ఆయన రిస్క్ తీసుకుని సినిమా స్టార్ట్ చేశారు. ఓ దర్శకుడుగా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీశాను. మా రెండో ప్రొడ్యూసర్ నాయుడుగారు కూడా ఈ సినిమాను తన భుజాలపై మోశారు. ఆయన వల్లే ఇంత మంచి అవుట్ పుట్ వచ్చిందని నమ్ముతున్నాను. మా డివోపి సాయికుమార్ గారికి నాన్ సింక్ లా అనిపించినా.. నేను అనుకున్న షాట్ తీయడానికి మ్యాజిక్స్ చేశారు. తను అందరితోనూ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ సపోర్టివ్ గా ఉంటాడు. టెక్నికల్ గా ఎడిటర్ శ్రీకాంత్ ఇచ్చిన సపోర్ట్ ఇంకెవరూ ఇవ్వలేరు. శర్వా సంగీతానికి ప్రాణం పోశాడు. పదిహేను ఇరవై రోజుల్లోనే సంగీతం ఇచ్చాడు. ఈ కథ గురించి చెప్పాలంటే.. లేడీ ఓరియంటెడ్ కథ ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ జరిగే ఓ కాన్ స్పిరసీ. ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన చుట్టూ కథనం సాగుతుంది. హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని చూసిన తర్వాత స్పందనను చూడగానే ఓకే చేశాం. వర్క్ షాప్ కూడా లేకుండానే సెట్స్ పైకి వెళ్లాం. షూటింగ్ కు ముందు ఒక సీన్ చేయిస్తే వెంటనే చేసింది. ఆ ధైర్యంతోనే షూటింగ్ కు వెళ్లాం. ఎప్పుడూ తనతో ప్రాబ్లమ్ రాలేదు. ఇక నా డైరెక్షన్ టీమ్ చాలా చాలా సపోర్ట్ చేసింది.. ” అన్నారు..

పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ .. ” టీజర్ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. మళయాలంలో ఎన్నో ఇంటరాగేషన్ ఫిల్మ్స్ వస్తుంటాయి. మన తెలుగులో ఆ జానర్ ఎందుకు లేదు అనుకుంటాను. ఈ టీజర్ చూస్తే ఆ జానర్ లో ఉంది. లైఫ్ లో కొన్ని కో ఇన్సెడెంట్స్ వర్కవుట్ అవుతాయి. ఈ చిత్రానికి అన్ని కో ఇన్స్ డెన్సెస్ వర్కవుట్ కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్… ” అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ .. ” డైరెక్టర్ రామ్ చాలా ప్యాసినేట్ గా అనిపించారు. టీజర్ చూస్తుంటేనే తను చెప్పాలనుకుంటున్నది కామన్ సెన్స్ గురించి అని. కామన్ సెన్స్ అన్నిటికీ ప్రధానం. సినిమా కూడా బాగా వచ్చిందని.. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. డివోపి సాయికుమార్ నాకు చాలాకాలంగా పరిచయం. అతనికి ఈ మూవీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ శర్వాకూ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ అందంగా ఉంది. టాలెంటెడ్ అండ్ టాల్ విమెన్ లా కనిపిస్తోంది. మిగతా టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు చెబుతూ.. మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ”

నటుడు మహేష్‌ మాట్లాడుతూ.. ” ఈ డైరెక్టర్ గారు నాకు ఫోన్ లోనే డైలాగ్స్ వినిపించారు. ఈ మూవీ టెక్నీషియన్స్ తో ఆల్రెడీ శశివదనే మూవీ చేశాను. ఈ సినిమాతో దర్శకుడుకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇంతమంచి కాన్సెప్ట్ ను ఎంకరేజ్ చేసినందుకు ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్.. ఈ మూవీ సీక్వెల్ లో కూడా నాకు పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

పలాస ఫేమ్ రక్షిత్ మాట్లాడుతూ.. ” నేను ఇక్కడికి రావడానికి కారణం.. ఇది నా సొంత ఈవెంట్ లా అనిపించింది. ఎందుకంటే.. మా మ్యూజిక్ డైరెక్టర్ శర్వా, డివోపి సాయికుమార్ తో పాటు పిఆర్వో జీఎస్కే మీడియా అంతా నాకు బాగా కావాల్సిన వాళ్లే. ముందుగా దర్శకుడు రామ్ గారికి అభినందనలు. సినిమా కోసం పోలీస్ జాబ్ వదిలేసి మరీ వచ్చారంటే చిన్న విషయం కాదు. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు చాలా హార్డ్ వర్క్ చేశారని తెలిసింది. వారికి బాగా డబ్బులు రావాలి. హీరోయిన్ స్పందనతో పాటు అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను..” అన్నారు.

హీరో యుగ్ రామ్ మాట్లాడుతూ.. రఘు కుంచెగారిని బ్రదర్ లా భావిస్తాను. మహేష్‌ గారు చిన్న స్థాయిలో నుంచి ఎదిగి చాలామందికి ఇన్సిస్పిరేషన్ గా నిలిచారు. రక్షిత్ గారు పలాస లో గొప్పగా నటించారు. మా దర్శకుడు, ప్రొడ్యూసర్స్, నా తోటి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియ్స్ అందరం చాలా కష్టపడి చేశాం. చిన్న సినిమాలా అస్సలు కనిపించదు. ట్రైలర్ ఇంకా బావుంటుంది. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ సో మచ్.. ” అన్నారు.

హీరోయిన్ స్పందన మాట్లాడుతూ.. ” ఇక్కడికి వచ్చిన చీఫ్‌ గెస్ట్ లందరికీ థ్యాంక్యూ. మీరు రావడంతో చాలా పాజిటివ్ గా అనిపించింది. నేను వందసార్లు మోటివేషనల్ స్పీకర్ గా మాట్లాడినా.. కానీ ఇక్కడ షివరింగ్ వస్తోంది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ. ప్రతి హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయాలనుకుంటుంది. దర్శకుడు రామ్ గారు చాలా మంచి వారు. ఇంటికి వచ్చి స్టోరీ చెప్పారు. థ్రిల్లర్ సినిమా అయినా చాలా ఫన్ గానూ ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్యూ సోమచ్. అలాగే మా ప్రొడ్యూసర్స్ చొరవ చూపకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మా డివోపి చాలా టార్చర్ పెట్టాడు. చాలా ఫన్ గా ఉంటాడు. రోజంతా షూటింగ్ చేసినా ఎప్పుడూ అలసిపోలేదు. ఎక్కువ షూటింగ్ అంతా వైజాగ్ లోనే బ్యూటీఫుల్ లొకేషన్స్ లో చేశాం. ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్.. ” అన్నారు.
డివోపి సాయికుమార్ మాట్లాడుతూ.. ” ముందుగా మా నిర్మాతలు సతీష్‌ వర్మ, నాయుడు గారు ఎప్పుడు ఏం అడిగినా నో చెప్పలేదు. మా యాక్టర్స్ అద్భుతంగా చేశారు. థియేటర్స్ లో వాళ్లని చూస్తే ఆశ్చర్యపోతారు. అంత బాగా నటించారు. మ్యూజిక్ శర్వా బాగా చేశాడు. దర్శకుడు చాలా షార్ట్ టైమ్ లో వచ్చారు. అతను చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. అందుకే షార్ట్ టైమ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఆయన నన్ను నమ్మి ఇంత వరకూ తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను..” అన్నారు.

హీరో వంశీ కోటు మాట్లాడుతూ.. “ముందుగా మా పేరెంట్స్, మా బ్రదర్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన చీఫ్‌ గెస్ట్ లందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. దర్శకుడు రామ్ నాకు ఈ కథ ఇనార్బిట్ మాల్ లో కలిసి కేవలం గంటన్నరలోనే ఈ కథ చెప్పారు. వెంటనే నేను చేస్తా అని చెప్పాను. డైరెక్టర్ సబ్ ఇన్స్ పెక్టర్. ఎంతో గట్స్ ఉంటే తప్ప ఆ పోస్ట్ వదులుకుని ప్యాషన్ కోసం డైరెక్షన్ వైపు కు రారు. మా ప్రొడ్యూసర్స్ అంతా మమ్మల్ని బాగా చూసుకున్నారు. మీకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. మా డివోపి పేరు గుర్తుంచుకోండి. టాలీవుడ్ లో ఈ పేరు మోగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ శర్వా ఓ పెద్ద హైలెట్ గా ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాకు అసలు హీరో అంటే స్పందన. ఈమె పర్ఫార్మెన్స్ ను ప్లే బ్యాక్ మూవీలో చూశాను. తన నటన చూశాక నా డౌట్స్ అన్నీ తీరిపోయాయి. మా మూవీని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...