Switch to English

Dead Pixel: ‘డెడ్ పిక్సెల్’ నాకు ఎంతో ప్రత్యేకం: నిహారిక కొణిదెల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Dead Pixel: నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్‌’. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ.. ‘ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్‌. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. ఈ షోను ఇంతలా తీసేందుకు సహకరించిన తమడా మీడియాకు థాంంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అందరూ కష్టపడటం వల్లే ఇంత బాగా వచ్చింది. ఫహద్ వల్లే నేను సెట్‌లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్‌ ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించింది. హాట్ స్టార్ మార్కెటింగ్ టీంకు స్పెషల్ థాంక్స్’ అని అన్నారు.

నిహారిక మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. ఈ పాత్రను చేయగలనని నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషణ్ పాత్రే చాలా కష్టమని కథ విన్నప్పుడు మాకు అనిపించింది. ఆ పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు థాంక్స్. ఇంకా నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. తమడా మీడియాకు థాంక్స్. ఈ వెబ్ సిరీస్‌కు పని చేయడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘దర్శకుడే ప్రతీ పాత్రను పోషిస్తాడని ఆదిత్యను చూశాకే అర్థమైంది. ఓ కిస్ సీన్ లేకుండా ప్రాజెక్ట్ చేయవా? అని అడుగుతుంటారు. కానీ ఇందులో అలాంటి సీన్లు ఏమీ ఉండవు. ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో లేదో చెప్పలేం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు నిహారికతో మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఉంది’ అని అన్నారు.

అక్షయ్ మాట్లాడుతూ.. ‘కరోనా ముందు ఎన్నో నాటకాల్లో నటించాను. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చింది. రెండేళ్లు ఎగిరిపోయాయి. ఇది నా మొదటి ప్రాజెక్ట్. భార్గవ్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది’ అని అన్నారు.

వైవా హర్ష మాట్లాడుతూ.. ‘నిహారిక, అక్షయ్, రోనక్, భావన అందరూ చక్కగా నటించారు. మా డైరెక్టర్ ఉగాది పచ్చడి లాంటి వారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయ’ని అన్నారు.

కెమెరామెన్ ఫహద్ మాట్లాడుతూ.. ‘సెట్‌లో ఎంతో సరదాగా పని చేశాం. అందరూ చక్కగా సహకరించారు. సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...