Switch to English

Indra: ‘ఇంద్ర’ పై నిర్మాత నిర్లక్ష్యం..! అశ్వనీదత్ పై మెగా ఫ్యాన్స్ అసహనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Indra: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్స్ లో ఇంద్ర(Indra) సినిమా ప్రత్యేకత వేరు. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ వెనుక టాలీవుడ్ పరిగెడుతున్న సమయంలో ఫ్యాక్షనిజం జోనర్లో ఆయన చేసిన ఒకేఒక్క సినిమా ‘ఇంద్ర’. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి పొటెన్షియాలిటీని నిరూపిస్తూ డబుల్ మార్జిన్ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా. యూట్యూబ్ లో ఇంద్ర హిందీ డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టరే. ఆస్థాయిలో నార్త్ ఆడియన్స్ చూశారు. అలాంటి సినిమాను శాటిలైట్ లో పదేళ్లుగా టెలికాస్ట్ చేయడం లేదు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే ఉంది. దీనిపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది ఇంద్రకు 20ఏళ్లు పూర్తైన సందర్భంగా సినిమాను 4k లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరారు. ‘మేమూ మెగాస్టార్ అభిమానులమే.. త్వరలో అభిమానుల కోరిక తీరుస్తాం’ అన్నారే కానీ ఇప్పటివరకూ అడుగు పడింది లేదు. గతంలో అశ్వనీదత్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని అంటున్నారు. టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటైన జగదేకవీరుడు అతిలోక సుందరికి 2020కి 30ఏళ్లు పూర్తయ్యాయి. ఓల్డ్ వెర్షన్ లోనే యూట్యూబ్ లో ఉంది. చిరంజీవి-శ్రీదేవి జోడి, సినిమా గ్రాండియర్ 4k రిసొల్యూషన్ తో ఉంటే మళ్లీ 30ఏళ్ల నాటి మ్యాజిక్ చూడొచ్చు. ఆ సినిమాను కూడా నిర్మాత అశ్వనీదత్ పట్టించుకున్నది లేదు.

అభిమాన హీరోతో బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాతగా అశ్వనీదత్ పై మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. అగ్ర నిర్మాత, నిర్మాణ సంస్థగా అశ్వనీదత్ కు ఇంద్రను రీ-మాస్టర్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ చేయడం లేదు. కనీసం శాటిలైట్ లో ప్రదర్శన ఉన్నా అప్పుడప్పుడూ టీవీల్లో సినిమా వస్తుంది. కానీ.. అభిమానులకు, ప్రేక్షకులకు అశ్వనీదత్ ఆ అవకాశం కల్పించట్లేదు. దీనిపై అభిమానులు నిరాశలో, ఒకింత ఆగ్రహంతో కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇంద్ర డీవీడీని పోస్ట్ చేస్తూ.. ‘ఇంతటి బ్లాక్ బస్టర్ ను నిర్మాత పట్టించుకోవట్లేదు. ఇది కూడా లేకపోతే పరిస్థితేంటో’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అశ్వనీదత్ స్పందనేంటో అందరికీ ‘చూడాలని ఉంది’.

25 COMMENTS

  1. What i don’t understood is in reality how you’re now not actually a lot more neatly-favored than you
    might be right now. You’re very intelligent. You recognize thus significantly in relation to this subject, produced me in my
    view believe it from so many numerous angles.
    Its like women and men are not involved unless it’s one thing to accomplish with Girl
    gaga! Your individual stuffs outstanding. At all times deal with it
    up!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....