Switch to English

ఇనాయా తెలివి.! ఫాఫం బలైపోయిన రాజ్, ఫైమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు.. ఆరో సీజన్ తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైమా, రాజ్‌లను తెలివిగా తప్పించేశారు మిగతా టీమ్ మెంబర్స్. లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఇనాయా.!

వివరాల్లోకి వెళితే, ఓ వాహనాన్ని బిగ్ బాస్ ఏర్పాటు చేశాడు.. దానికో హార్న్ అమర్చాడు. ఆ హార్న్ ఎవరు కొడతారో, వారు కంటెండర్స్ అవుతారు కెప్టెన్సీకి. అలా హార్న్ కొట్టేందుకోసం ఇద్దర్ని ఇంటి సభ్యులు ఎంచుకోవాల్సి వుంటుంది. ఆ ఇద్దర్ని ఎంచుకునే క్రమంలో రాజకీయాలు నడిచాయి.

ఫైమాని తొలుత మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా పక్కన పడేశారు. దాంతో, ఫైమా చాలా బాధపడింది. తనను అంతా కార్నర్ చేస్తారని ముందే అనుకున్నాననీ, అదే జరిగిందని ఫైమా వాపోయింది. మరోపక్క, రాజ్‌కి ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేసిందంటూ చెత్త లాజిక్ చెప్పి అతన్నీ పోటీ నుంచి తప్పించేశారు.

ఇనాయా – రాజ్ మధ్య మాటల యుద్ధం, కీర్తి – శ్రీహాన్ మధ్య వెటకారాలు, విమర్శలు.. వెరసి, కొంత హాట్ హాట్‌గా మారింది వాతావరణం. ఆదిరెడ్డి నేతృత్వంలో పెద్ద గూడు పుఠానీ నడిచింది కంటెండెర్ల వ్యవహారంలో. ఈ లిస్టులోకి చివరి ఎంట్రీ ఇనాయాకి లభించింది.

చివరగా ముగ్గురు ముగ్గురు మిగిలితే అందులో ఇనాయా కూడా వుంది. కీర్తి, మెరీనా ఆ మిగతా ఇద్దరు. తాను పక్కకి తప్పుకుంటున్నట్లు ఇనాయా తెలివిగా ప్రకటించింది. దాంతో, హార్న్ కొట్టేందుకు కీర్తి – మెరీనా వెళ్ళగా, కీర్తిని పక్కకు పెట్టి, మెరీనాని ముందుకు తీసుకొచ్చారు ఆల్రెడీ కంటెండర్లు అయినోళ్ళు.

ఆ మెరీనాతో కలిసి హార్న్ కొట్టే ఛాన్స్ దక్కించుకుంది ఇనాయా. మెరీనాకి కాలు నొప్పి వుండటంతో, ఇనాయా సులువుగా పరిగెత్తి హార్న్ కొట్టగలిగింది. త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి, మిగతా ఇద్దర్ని.. అంటే కీర్తి, మెరీనాలకు వెన్నుపోటు పొడిచినట్లయ్యింది ఇనాయా వ్యవహారం.

అన్నట్టు, ఈ టాస్క్‌ పేరు చెప్పి బిగ్ బాస్ తెలివిగా, ప్రైజ్ మనీ నుంచి గట్టిగానే కోతలు విధించేశాడు. దాదాపు 42 లక్షలకు పడిపోయిందిప్పుడు ప్రైజ్ మనీ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...