Switch to English

ఒట్టు నమ్మండి.! ఆంధ్రప్రదేశ్ అప్పులు తక్కువే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానమంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దేశం అప్పులు చేస్తోంది. రాష్ట్రాలూ అప్పులు చేస్తున్నాయి. కోవిడ్ పాండమిక్ అనేది ఓ కుంటి సాకు మాత్రమే. అడ్డగోలుగా అప్పులు చేయడంలో రాష్ట్రాలతో కేంద్రమూ పోటీ పడుతోంది. తాము తెచ్చిన సంస్కరణల్ని ఆయా రాష్ట్రాలు అమలు చేస్తే, అదనంగా అప్పులు చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది కేంద్రం.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రాష్ట్రాలూ అలాగే దేశం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. పెట్రో పన్నులు ఏ స్థాయిలో వున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి కాకుండా ప్రతినెలా ఏదో ఒక రూపంలో సామాన్యుడి మీద కేంద్రం భారం వేస్తూనే వుంది. చెత్త పన్ను పేరుతో రాష్ట్రాలు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వైనం కళ్ళ ముందుకు కనిపిస్తూనే వుంది.

ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి.. విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ప్రతి నెలా సామాన్యుడి బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిపోతోంటే, ‘ఆల్ ఈజ్ వెల్..’ అని రాష్ట్రాలూ, కేంద్రం చెబుతుండడం గమనార్హం. ఇంతా జరుగుతున్నా సామాన్యుడి బతుకు ఎదుగూ బొదుగూ లేకుండా పోతోంది. ఆ స్థాయిలో రాష్ట్రాలు, కేంద్రం సామాన్యుడ్ని బాదేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయానికొస్తే, ఇందులో దాపరికమేమీ లేదు. అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏ నెల ఎంత అప్పులు చేస్తున్నదీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే వెల్లడిస్తోంది. ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో వుండడం కంటే దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా వుండడం చూస్తున్నాం. కొత్త అప్పుల కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం.. అన్నట్టుంది రాష్ట్ర ఆర్థిక మంత్రి పరిస్థితి.

అయినాగానీ, ఆల్ ఈజ్ వెల్.. దేశంలో చాలా రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి లోబడి అప్పలు చేస్తోందట. అలాగని కాగ్ చెప్పిందంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. వేరే రాష్ట్రాలు అప్పులు చేస్తే, అక్కడ అభివృద్ధి వుంది.. తీర్చగలిగే శక్తి కూడా వుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ.? సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప.

రాజధాని లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా.? చేస్తున్న అప్పుల్లో పదో వందు.. కాదు కాదు, కనీసం ఒకటో వంతు అయినా, రాష్ట్ర రాజధాని మీద పెడితే.. ఎంతో కొంత ఆర్థిక ప్రగతి రాష్ట్రానికి సాధ్యమవుతుంది కదా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఎక్కువ చదివినవి

Balakrishna : బర్త్‌ డే స్పెషల్‌ : డబుల్‌ హ్యాట్రిక్ బాలయ్య

Balakrishna : నందమూరి బాలకృష్ణ... ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న బాలయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు...

వైసీపీ వితండవాదం.. ‘మంచి చేసి ఓడిపోయాం.!

జనం ఈడ్చి కొట్టారన్నది చిన్నమాట.! ఔను, ఈ మాటని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.! ఇదే నిజం మరి.! 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. 2024 ఎన్నికలకు...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..హోమ్ మినిస్టర్ అనిత

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 12 న నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజే 25 మంత్రులను ప్రకటించారు. శుక్రవారం వారికి ముఖ్యమంత్రి శాఖలను...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 15 జూన్ 2024

పంచాంగం తేదీ 15- 06-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల నవమి రా.12.35, తదుపరి...