Switch to English

పోలవరం ప్రాజెక్టు ‘ఎత్తు’ మిస్టరీ: ఎవరిది బుకాయింపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై గత కొంతకాలంగా రాజకీయ రగడ జరుగుతోంది. ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నట్టు, ప్రాజెక్టు పూర్తయ్యే దారి కనిపించడంలేదుగానీ, పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించిన గోలేంటట.? అనేవారూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.

పోలవరం ప్రాజెక్టుకి రాజకీయ గ్రహణం పట్టింది. ఒకప్పుడు ‘జలయజ్ఞం’ పేరుతో పోలవరం ప్రాజెక్టు చుట్టూ బోల్డంత పబ్లిసిటీ స్టంట్ జరిగింది.. చాలామంది రాజకీయ నాయకులు ఆర్థికంగా బలపడ్డారు. ఆ ప్రాజెక్టు ప్రజలకు కాదు, రాజకీయ నాయకులకు, పార్టీలకు జీవనాడిగా మారిపోయింది మరి.

పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నారని గతంలో ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ ఏటీఎం నుంచి ఎంత సొమ్ము అక్రమంగా బయటకు పోయిందీ తేల్చేలేదటే ఆ తర్వాత ‘వాటాల్లో’ పంపకాలు సజావుగా జరిగాయనే అనుకోవాలేమో.

ఇక, పోలవరం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు తేల్చుతామని చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదంటే, ఆ ప్రాజెక్టు పేరు చెప్పి వైసీపీకి దక్కిన వాటా కూడా ఘనంగానే వుండి వుండాలి.

ఇంత నాటకం నడిచింది ఇన్నేళ్ళలో పోలవరం ప్రాజెక్టు చుట్టూ. కేంద్రమేమో, కొత్త అంచనాలకు తగ్గట్టుగా ‘ఖర్చు’కి ఆమోదం తెలుపుతుంది.. కానీ, అంతలోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది. రాష్ట్రమేమో ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తుంటుంది. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది.

2018 చివరి నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు, 2021 చివరి నాటికీ పూర్తి కాలేదు. త్వరలో.. అతి త్వరలో.. అంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఇప్పుడేమో ఎలాగోలా ‘మమ’ అనిపించేయడానికి ‘ఎత్తు తగ్గింపు’ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్టున్నారు. ‘ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని తమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు’ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, అసెంబ్లీలోనే ప్రకటించేశారు గతంలో.

అబ్బే, తూచ్.. టీడీపీ డ్రామాలాడుతోంది.. టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటోన్న వైసీపీ, నిజానిజాలేంటో మాత్రం గుండె మీద చెయ్యేసుకుని చెప్పలేకపోతోంది.

4 COMMENTS

  1. 309823 911357I really like the appear of your website. I lately built mine and I was looking for some style concepts and you gave me some. May I ask you whether you developed the site by youself? 839491

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...