Switch to English

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యూ టర్న్ నామ సంవత్సరమిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఏం చెప్పారు.? ఏం చేస్తున్నారు.? ఏకైక రాజధాని అమరావతి దండగ.. మూడు రాజధానులే పండగన్నారు.. మూడు రాజధానుల చట్టం తెచ్చారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. శాసన మండలి ఖర్చు దండగ వ్యవహారమన్నారు. శాసన మండలిని రద్దు చేయడానికి తీర్మానం చేశారు. కానీ, ఆ శాసన మండలిలో మెజార్టీ వచ్చాక, శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

మాట తప్పడు.. మడమ తిప్పడు.. ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పదే పదే వైసీపీ నేతలు చెప్పే మాట. నిజానికి, ఇదొక నినాదంగా మారిపోయింది వైఎస్సార్సీపీకి. ఇప్పుడేమో, ‘మాట తప్పుతాడు.. మడమ తిప్పుతాడు..’ అనాలేమో. నిజానికి, మాట తప్పడం.. మడమ తిప్పడం.. అనేది ఇప్పటి మాట కాదు.

ఎంపీలు రాజీనామాలు చేస్తేనే, ప్రత్యేక హోదా వస్తుందన్నది ఒకప్పటి నినాదం. అధికారంలోకి వస్తూనే, ఆ నినాదానికి పాతరేశారు. ‘రాజీనామాలు చేస్తే, పార్లమెంటులో ఎవరు పోరాడతారు.?’ అని వైసీపీ ప్రశ్నిస్తోందిప్పుడు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టారు. టీటీడీలో శేఖర్ రెడ్డి నియామకం ఒకప్పుడు వైసీపీకి నచ్చని విషయం. కానీ, అధికారంలోకి వచ్చాక అదే మెచ్చిన విషయమైపోయింది.

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్. ‘యూ టర్న్’ల సంఖ్య లెక్కేస్తే.. అది లెక్కలకు అందదన్నది నేటి మాట. అన్నిటిలోకీ పెద్ద యూ టర్న్.. అంటే, అది శాసన మండలి రద్దు వ్యవహారమే. ‘కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసింది కాబట్టి..’ అంటూ కుంటి సాకు చెబుతోందిప్పుడు వైసీపీ.

కానీ, శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, శాసన మండలి సభ్యత్వం విషయమై హామీలు ఇవ్వడంతోనే.. వైసీపీ డొల్లతనం బయటపడిపోయింది. మూడు రాజధానుల విషయంలో ఇంకా వైసీపీ, లేనిపోని డప్పాలు కొడుతూనే వుంది.

‘అబ్బే, మేం వెనక్కి మళ్ళలేదు.. మెరుగైన బిల్లు తీసుకొస్తాం..’ అని వైసీపీ చెబుతోంది. ఎలా.? గడచిన రెండున్నరేళ్ళలో రాజధాని పేరుతో అమరావతిలో ఒక్క అదనపు నిర్మాణమైనా జరిగిందా.? జరగలేదాయె. మరెలా విశాఖలో అయినా, కర్నూలులో అయినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడీషియల్ క్యాపిటల్ పేర్లతో అభివృద్ధి చేసేస్తారు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...