Switch to English

సాహో బ్రేకింగ్‌: 100 కోట్లు.. ప్రభాస్‌ రేంజ్‌ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

ఆగస్ట్‌ 30న ‘సాహో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో, సినిమా గురించి ఏ విషయం బయటకొచ్చినా, ఆ విషయమ్మీద విపరీతమైన ఆసక్తి నెలకొంటోంది. అది నిజమా.? కాదా.? అన్నది వేరే చర్చ. తాజా చర్చ దేని గురించో తెలుసా.? ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ గురించి. నిజానికి, ‘మిర్చి’ సినిమాకి ప్రభాస్‌ ఎంత తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. ‘బాహుబలి’ సిరీస్‌ సంగతి సరే సరి. రెమ్యునరేషన్‌ గురించి ఆలోచిస్తే, ప్రభాస్‌ నుంచి ‘బాహుబలి’ వచ్చేదే కాదు.! కానీ, ‘మిర్చి’.. ఆ తర్వాత ‘బాహుబలి’తో ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది.

అయితే, అది ఏ స్థాయికి వెళ్ళిందనేది మాత్రం ఊహించడం కష్టం. అన్ని అనుమానాలకీ ‘సాహో’ సమాధానమిచ్చేస్తుంది. ఇంతకీ, ‘సాహో’ సినిమాకి ప్రభాస్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట.? ఈ విషయమై సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ చర్చల సారాంశమేంటంటే, ప్రభాస్‌కి రెమ్యునరేషన్‌ రూపంలో దాదాపు వంద కోట్ల రూపాయలు దక్కనుందని. ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్‌ తీసుకోకుండా, ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో వాటా ప్రభాస్‌ అడిగాడన్నది సినీ పరిశ్రమలో ప్రముఖంగా విన్పిస్తోన్న ఓ గాసిప్‌.

ఇందులో నిజమెంతోగానీ, 100 కోట్ల రెమ్యునరేషన్‌ ఓ టాలీవుడ్‌ హీరో తీసుకుంటున్నాడంటే అది ఆషామాషీ విషయం కాదు. మొత్తంగా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్‌ పేరుని ఇప్పుడు లిఖించేయ్యాలేమో. కానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్‌ ఈ సినిమాకి ఆ స్థాయిలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయలేదట. ‘సాహో’ సినిమాని తొలుత మామూలుగానే ప్లాన్‌ చేశారు. ‘బాహుబలి’ సిరీస్‌ వచ్చాక, సీన్‌ మారిపోయింది. క్రమక్రమంగా అంచనాలు పెరిగిపోయాయి.. సినిమా రేంజ్‌ కూడా పెరిగిపోయింది. దాంతో, ముందు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్‌గా ఇచ్చేందుకు స్వయంగా నిర్మాతలే ముందుకొచ్చారట. అదెంత.? అన్నది మళ్ళీ సస్పెన్స్‌.

‘ప్రభాస్‌ నిజంగానే అందరికీ డార్లింగ్‌. నిర్మాతలు శ్రేయస్సు కోరే వ్యక్తి ఆయన. అన్ని రోజులపాటు డేట్స్‌ ఇవ్వడం ఒక ఎత్తయితే.. తన స్టార్‌డమ్‌ గురించీ, తన మార్కెట్‌ వాల్యూ గురించీ ఆలోచించకుండా కేవలం సినిమా గురించే ఆలోచిస్తాడు..’ అని ‘సాహో’ వర్గాలు వెల్లడించాయి. 100 కోట్ల క్లబ్‌లోకి ‘సాహో’ చేరడం అన్నది చాలా చిన్న విషయం. చాలా ఈజీగా 400 కోట్ల రూపాయల్ని ‘సాహో’ కొల్లగొట్టేయొచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, ‘బాహుబలి’ రికార్డుల మాటేమిటి.? ఏమో, ‘బాహుబలి’ ఆ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరైనా ఊహించారా.? ప్రభాస్‌ కమిట్‌మెంట్‌ చూస్తోంటే, ‘సాహో’తో తన ‘బాహుబలి’ రికార్డుల్ని తానే కొల్లగొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈనెల 27న విడుదల...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీల్లో మెగాస్టార్...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 13 జూన్ 2024

పంచాంగం తేదీ 13- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల సప్తమి రాత్రి 8.37...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచింది....