Switch to English

అప్పుచేసి పప్పుకూడు.. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సంక్షేమం విషయంలో రాష్ట్రం దూసుకుపోతోందన్నది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మంచిదే.. కానీ, ఎప్పడు.? ఆ సంక్షేమం, రాష్ట్రాన్ని అప్పుల్లో పడేయనప్పుడు మాత్రమే. అప్పు చేసి సంక్షేమ కూడు పెడతామంటే ఎలా.? ఆ అప్పుల్ని భరించాల్సింది ఇప్పుడెవరైతే సంక్షేమ ఫలాలు పొందుతున్నారో.. వాళ్ళే.! పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రపదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువ. పొరుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కనిపిస్తోంది.. ఆంధ్రపదేశ్‌ మాత్రం అభివృద్ధి అంటే ఏంటి.? అన్న ప్రశ్నల నడుమ సమాధానం చెప్పలేక విలవిల్లాడుతోంది. అయినా, ప్రజలకు అభివృద్ధి అనవసరం.. సంక్షేమమే అతి ముఖ్యం.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

తాజాగా జగన్ సర్కార్ మరికొన్ని సంక్షేమ పథకాల్ని తెరపైకి తెచ్చింది. సంక్షేమ క్యాలెండర్ కూడా నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ఖరారయ్యింది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించడమో.. ఇంకొకటో చేస్తే, రాష్ట్ర ప్రజలు కొంత మేర తేరుకుంటారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటే, ఉత్పాదకత పెరుగుతుంది.. ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కానీ, ఇవేవీ రాష్ట్రానికి అవసరం లేదన్నట్టే వ్యవహరిస్తోంది వైసీపీ ప్రభుత్వం.

ఇప్పటికే రాష్ట్రం, రికార్డు స్థాయిలో అప్పులు చేసేసింది. ఎంతలా ధరలు పెంచేస్తున్నా, ఎంతలా పన్నుల భారం మోపుతున్నా.. రాష్ట్రం అప్పులు చేయకుండా ముందడుగు వేయలేని దుస్థితి. కొత్తగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంపై జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఆర్థిక వనరులంటే.. ఇక్కడ అప్పులు.. అని అర్థం. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రానికి పెద్దయెత్తున అప్పులు మిగిల్చిపోయారని విమర్శించిన వైసీపీ, అంతకు మించి అప్పులు చేయడంలో పోటీ పడుతోంది. అంటే, రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగానే తయారైందని అనుకోవాలి కదా.

సంక్షేమ పథకాలు తమకు తిరిగి అధికారం కట్టబెడతాయని ఏ రాజకీయ పార్టీ భావించినా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అభివృద్ధి చేయడం చేతకానప్పుడే పబ్లసిటీ స్టంట్లు చేస్తారు పాలకులు.. రాష్ట్రంలో జరుగుతున్నది అదే.. చంద్రబాబు హయాంలోనూ, జగన్ హయాంలోనూ.. ఇదే జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....