రైతులకు ఏడాదికి 13,500 రూపాయల మేర ‘భరోసా’ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ మొత్తాన్ని అందించనున్నాయి. గతానికి భిన్నంగా వైఎస్ జగన్ సర్కార్, ఈ పథకానికి వైఎస్సార్ పేరుతోపాటు, పీఎం కిసాన్ అనే పేరునీ జోడించిన విషయం విదితమే. దాంతో, సగం క్రెడిట్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నాయి. అయితే, ఈ మొత్తం మూడు విడతల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రైతుల్లో కొంతమేర అసహనం వ్యక్తమవుతోంది.
ఇక, ఏ సంక్షేమ పథకం తెరపైకొచ్చినా.. అందులో పొలిటికల్ పబ్లిసిటీ సుస్పష్టం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాయంటే.. పరోక్షంగా ప్రజల మీదనే ఆ భారం పడుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ప్రజల నుంచే ప్రభుత్వాలు పన్నుల రూపంలో రాబట్టాలి. అలాంటప్పుడు, ప్రభుత్వ పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సబబు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
‘మా ప్రభుత్వం చేసింది అనే గుర్తింపు కోసం పేర్లు, రంగులు తప్పవు..’ అని వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నా, ఇదే వైసీపీ నేతలు ఒకప్పుడు చంద్రబాబు పాలనపై ‘రంగులు – పేర్లు’పై విమర్శలు చేశారు కదా.! గ్రామ సచివాలయాలకి వైసీపీ జెండా రంగులు వేసింది జగన్ సర్కార్. రేప్పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధికారిక భవనాల నిర్మాణం పూర్తయితే, వాటికీ ఆ రంగులు వేస్తారా.? అన్నదీ వేచి చూడాల్సిందే. రైతు భరోసా విషయానికొస్తే, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందించి వుండాల్సిందన్నది వైసీపీలోనే చాలామంది నేతలు అంతర్గతంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
‘7,500 రూపాయలు ఇస్తున్నాం.. మరో 5,000 రూపాయల విషయంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాం.?’ అని పలువురు సీనియర్ నేతలు జగన్ దృష్టికి తమ ఆలోచనల్ని తీసుకెళ్ళారట. నిజమే, వృద్ధాప్య పెన్షన్ల విషయానికొస్తే, 2,250 రూపాయలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని 3 వేల రూపాయలకు క్రమక్రమంగా పెంచనున్నారు కూడా. అలాంటప్పుడు, రైతులకు కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలకు తోడు.. రాష్ట్ర ప్రభుత్వం, 12,500 ఇస్తే బావుండేదన్నది మెజార్టీ అభిప్రాయం.
ఇది ఏడాదికి ఇచ్చే సొమ్ము. నిజానికి ఇంకా ఎక్కువే రైతుకి ఇచ్చినా మంచిదే.! రైతు విషయంలోనే ఎందుకీ ‘బీదరికం’.? ఇది రైతుల్ని అవమానించడం కాదా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నగు జగన్ సర్కార్ పట్ల రైతుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది.
73866 72658Its superb as your other posts : D, regards for posting . 213420
635908 380021 Its hard to locate knowledgeable folks on this subject, but you sound like you know what you are talking about! Thanks 326624
974588 360720Taking a look ahead to look you. 765863