Switch to English

టెన్షన్‌లో రౌడీ.. విజయ్‌ దేవరకొండని గట్టెక్కించేదెవరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా రిజల్ట్‌ తర్వాత ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ ఆలోచనల్లో చాలా మార్పు కన్పిస్తోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేతిలో ‘హీరో’తోపాటు మరికొన్ని సినిమాలున్నా, విజయ్‌ దేవరకొండ అభద్రతా భావంతో కన్పిస్తున్నాడట. ఒక్క సినిమాతోనే విజయ్‌ ఎందుకిలా ‘డౌన్‌’ అయిపోతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. గతంలోనూ ఇదే పరిస్థితి. ‘నోటా’ సినిమా రిజల్ట్‌ తర్వాత విజయ్‌ షాక్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ టైమ్‌లో మీడియాకి ఓ లేఖ విడుదల చేశాడు. లైట్‌ తీసుకోవాల్సిన విషయం గురించి, సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యాడు. ‘ఇలాగైతే స్టార్‌ హీరోగా ఎదిగేదెలా.? సినీ రంగంలో నిలదొక్కుకునేదెలా.?’ అని సన్నిహితులు అప్పట్లో వారించాల్సి వచ్చింది.

బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టి.. అనూహ్యంగా తెరమరుగైపోయిన ఎందరో స్టార్లు తెలుగు సినిమా చరిత్రలో మనకి కన్పిస్తారు. సినిమా అంటేనే అంత. ఇక్కడ నిలదొక్కుకోవడం అనేది కేవలం సక్సెస్‌ మీద మాత్రమే ఆధారపడి వుండదు. సరే, ఆ విషయం పక్కన పెడితే, 100 కోట్ల క్లబ్‌లోకి విజయ్‌ని చేరుస్తుందని అంతా ‘డియర్‌ కామ్రేడ్‌’ గురించి అనుకున్నారు. కానీ, అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే, అసలు ఫ్లాప్‌ సినిమాలెందుకొస్తాయి.? తెలిసి తెలిసీ ఎవరైనా ఫ్లాప్‌ సినిమాలు చేస్తారా.?

విజయ్‌ మనస్తత్వం చిత్ర విచిత్రంగా వుంటుంది. ‘రౌడీ’ యాటిట్యూడ్‌.. సక్సెస్‌తో బాగానే వుంటుంది. ఫెయిల్యూర్‌ వస్తే మాత్రం, ఆ యాటిట్యూడ్‌ నవ్వుల పాలవుతుందనేవారి మాటల్ని ఎలా తప్పు పట్టగలం.? ఇప్పుడు అర్జంటుగా విజయ్‌ దేవరకొండకి సూపర్‌ హిట్‌ కావాలి. ఆ హిట్‌ ఇచ్చేదెవరు.? మళ్ళీ ‘గీత గోవిందం’ డైరెక్టర్‌ పరశురామ్‌ పంచన చేరతాడా.? లేదంటే, ‘అర్జున్‌ రెడ్డి’ సిక్వెల్‌ ఆలోచనలు ఆల్రెడీ చేసిన సందీప్‌ రెడ్డి వంగాని విజయ్‌ దేవరకొండ సాయం కోరతాడా.? అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

అయితే, సందీప్‌ రెడ్డి వంగా, బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నాడు.. అదీ సల్మాన్‌ఖాన్‌తో. పరశురామ్‌ మాత్రం ఖాళీగానే వున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత మరే సినిమాకీ కమిట్‌ కాలేదీ దర్శకుడు. తనే నిర్మాతగా పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది విజయ్‌ దేవరకొండ ఆలోచన అట. ‘హీరో’ సినిమా ఆగిపోయిందనే ప్రచారం నేపథ్యంలో విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారమ్‌.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు మృతుడిని చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన కళావేదిక...

వైసీపీ వితండవాదం.. ‘మంచి చేసి ఓడిపోయాం.!

జనం ఈడ్చి కొట్టారన్నది చిన్నమాట.! ఔను, ఈ మాటని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.! ఇదే నిజం మరి.! 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. 2024 ఎన్నికలకు...