దళపతి విజయ్ తొలిసారి తన కెరీర్ లో డైరెక్ట్ తెలుగు చిత్రం చేస్తోన్న విషయం తెల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు – తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో కాస్ట్ అయితే భారీగానే ఉంది.
శరత్ కుమార్, జయసుధ, శామ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ప్రభు, యోగిబాబు, సంగీత వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. హరి, ఆశిషోర్ సోలమన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
895650 144522Theres noticeably a bundle to uncover out about this. I assume you made certain excellent points in features also. 787304