పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్ పూర్తైన తర్వాత మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో రెండో హీరో పేరును ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ నటించనున్న ఏ సినిమా విషయంలోనైనా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం ఉంటుందన్న తరహాలోనే తెలుగు మీడియా వ్యవహరిస్తోంది. అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకు కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నాడని, ఇందుకోసం భారీ మొత్తంలో ఏకంగా 10 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకుంటాడని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ రూమర్స్ విషయంలో ఎలాంటి నిజం లేదని సమాచారం. అసలు అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కు త్రివిక్రమ్ కు ఎలాంటి సంబంధం లేదట. కేవలం పవన్ కు సన్నిహితుడు అవ్వడం మూలంగా త్రివిక్రమ్ పేరుని ప్రతీ సినిమా విషయంలో తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ దృష్టి అంతా తాను ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా పైనే.
603720 253856Hey! Good stuff, do tell us when you post something like that! 712404
24881 927011I like this internet site because so considerably helpful stuff on here : D. 300990