Switch to English

Home స్పోర్ట్స్ టెస్ట్ క్రికెట్ లో ఎప్పటికి బ్రేక్ చేయలేని రికార్డు లు ఇవే.. అవేంటో చూడండి ..

టెస్ట్ క్రికెట్ లో ఎప్పటికి బ్రేక్ చేయలేని రికార్డు లు ఇవే.. అవేంటో చూడండి ..

0
టెస్ట్ క్రికెట్ లో ఎప్పటికి బ్రేక్ చేయలేని రికార్డు లు ఇవే.. అవేంటో  చూడండి ..
sachin-tendulkar-century-1
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

1. బ్రియాన్ లారా 400* టెస్ట్ ఇన్నింగ్స్

టెస్ట్ క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ లలో ఒకరు బ్రియాన్ చార్లెస్ లారా , ఇతను బ్యాట్ పట్టుకొని స్టేడియం లోకి వస్తుంటే అభిమానులలో ఆనందం , ప్రత్యర్థి జట్టు బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టేది . బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ కి ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్ లు గెలిపించాడు . టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అయినప్పటికీ క్రికెట్ విశ్లేషకులు మాత్రం బ్రియాన్ లారా నే అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ గా అభివర్ణిస్తారు , దానికి కారణం అతడు చేసిన పరుగులలో ఎక్కువ శాతం వెస్టిండీస్ గెలిచినా మ్యాచ్ లలో చేసినవే .. ఇప్పటికి టెస్ట్ క్రికెట్ లో మ్యాచ్ విన్నర్ అనే ప్రస్తావన వస్తే బ్రియాన్ లారా నే ముందుంటాడు . అయితే 2004 లో ఇంగ్లాండ్ పైన టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో చేసిన 400* పరుగుల రికార్డు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం ల అనిపిస్తుంది , దానికి కారణం ప్రస్తుత జనరేషన్ ఆటగాళ్లు ఎక్కువగా టీ20 లు ఆడడం తో పాటు టెస్టుల్లో భారీ ఇన్నింగ్స్ చేయడానికి అవసరమైన ఓపిక , టెక్నిక్ లు లేకపోవడం

2. ముత్తయ్య మురళీధరన్ 800 టెస్ట్ వికెట్ లు

శ్రీలంక జట్టు ని తన బౌలింగ్ మాయాజాలం తో ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 1347 వికెట్ లు తీసాడు . అందులో 800 వికెట్ లు టెస్టుల్లో , 534 వికెట్ లు వన్డే లలో , 13 వికెట్ లు టీ 20 లలో తీసాడు . 133 టెస్ట్ లు ఆడిన మురళి 22.73 సగటు తో 800 వికెట్ లు తీసాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లు ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లు కనీసం అతని చేరువలో కూడా లేరు ..

3. సచిన్ టెండూల్కర్ రికార్డులు

సచిన్ టెండూల్కర్ కి ఈ పేరు చెప్పగానే మనకి చాలా రికార్డ్ లు గుర్తొస్తాయి. తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో సచిన్ సాధించిన రికార్డ్ లు ఎన్నో… 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన టెండూల్కర్ 53.8 సగటుతో 15921 పరుగులు చేసాడు.టెస్ట్ లలో అతని పరుగుల దరిదాపుల్లోకి కొంత మంది క్రికెటర్లు వచ్చిన వయస్సు ప్రభావం చూపడం తో క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అతను ఆడిన టెస్ట్ మ్యాచ్ లు , టెస్టుల్లో సచిన్ చేసిన 15921 పరుగులు ఈ రెండు రికార్డ్ లు బ్రేక్ చేయడం దాదాపు కష్టమే..

4. జింలేకర్ ఒకే టెస్టులో 19 వికెట్లు

జేమ్స్ చార్లెస్ లేకర్ ( జింలేకర్ ) ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ బౌలర్. ఇతను 1956 లో ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్ లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 19 వికెట్ లు తీసి ప్రపంచ రికార్డ్ ను నమోదు చేశాడు. జింలేకర్ ఆ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 37 పరుగులిచ్చి 9 వికెట్లు తీయగా , రెండో ఇన్నింగ్స్ లో 53 పరుగులిచ్చి 10 వికెట్ లు తీసాడు. టెస్ట్ క్రికెట్ లో ఈ రికార్డ్ బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమే..

5. డాన్ బ్రాడ్మాన్ 99.94 టెస్ట్ యావరేజ్

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్మాన్ టెస్ట్ క్రికెట్ లో 52 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 99.90 సగటుతో 6996 పరుగులు చేసాడు. అయితే అతని క్రికెట్ కెరీర్ లో ఆడిన చివరి ఇన్నింగ్స్ లో డకౌట్ అవడం తో బ్రాడ్మాన్ సగటు 99.94 వద్దే ఆగిపోయింది. ఈ రికార్డ్ నెలకోల్పి ఇప్పటికి 70 ఏళ్ళు అవుతున్న ఇంతవరకు టెస్టుల్లో ఆ సగటు దరిదాపుల్లోకి కూడా ఎవరు రాలేదు..