Teja Sajja: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’ విడుదలై నేటికి (ఆగష్టు 27) 25ఏళ్లూ పూర్తైంది. ఈ సందర్భంగా సినిమాలో చిరంజీవి కొడుకుగా నటించి ఆకట్టుకున్న బాల నటుడు, నేటి హీరో తేజ సజ్జా (Teja Sajja) కూడా నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.
‘ఊహ తెలీని రోజుల్లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టా. ఇప్పుడు నా వయసు 28. తొలి సినిమాలోనే లెజెండ్ చిరంజీవిగారితో నటించే అవకాశం దొరికింది. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. అప్పుడే 25ఏళ్లు గడచిపోయాయి. చూడాలని ఉంది నుంచి ఇప్పటి హనుమాన్ వరకూ ప్రయాణం కలలా అనిపిస్తోంది. దీనికి కారణం గుణశేఖర్, చిరంజీవి, అశ్వనీదత్ గారు. మీరంతా నా జీవితాతాన్ని మార్చారు. ఇందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’నని అన్నారు.
తేజ బాలనటుడిగా.. ఇంద్ర, ఠాగూర్, బాలు, యువరాజు, రాజకుమారుడు, కలిసుందాం.. రా, గంగోత్రి తదితర సినిమాల్లో నటించాడు. జాంబిరెడ్డితో హీరోగా పరిచయమై ఇష్క్, అద్భుతం సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తేజ నటించిన హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
#25YearsForChoodalaniVundi @KChiruTweets garu@Gunasekhar1 garu @VyjayanthiFilms pic.twitter.com/NyDKxQ2ev1
— Teja Sajja (@tejasajja123) August 27, 2023