Switch to English

Home సినిమా 20 ఏళ్ళు, 25 సినిమాలు .. ఇదే మహేష్ బాబు జర్నీ

20 ఏళ్ళు, 25 సినిమాలు .. ఇదే మహేష్ బాబు జర్నీ

0
20 ఏళ్ళు, 25 సినిమాలు .. ఇదే మహేష్ బాబు జర్నీ
WhatsApp-Image-2019-05-08-at-7.33.06-PM
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ బాబు .. తనదైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. చార్మింగ్ .. మాస్ లుక్.. స్టైల్ .. అన్ని కలిపితే మహేష్. మహేష్ అంటే ఒక్క టాలీవుడ్ లోనే కాదండోయ్ .. అటు బాలీవుడ్డు .. ఇటు కోలీవుడ్డులో అదే రేంజ్ క్రేజ్. ఇక టాలీవుడ్ లో అయితే మహేష్ నిజంగా ఒక్కడు. ఎందుకంటే ఓ వైపు మెగా హీరోలు .. దాదాపు అరడజను పైగా .. మరోవైపు నందమూరి హీరోలు . అయినా సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో నంబర్ 1 హీరో ఇమేజ్ దక్కించుకున్నాడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహేష్ బ్యాచ్ లో ఆయనకు సపోర్టింగ్ హీరోలు, ఫ్యామిలి హీరోలు ఎవరు లేరు?

ఘట్టమనేని శివరామ కృష్ణ .. అలియాస్ సూపర్ కృష్ణ గా టాలీవుడ్ లో చెరగని ఛరిస్మాతో నిలదొక్కుకున్న హీరో. అయన తన వారసులను కూడా హీరోలుగా నిలబెట్టే ప్రయత్నం చేసారు. అందులో ముందుగా హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ అన్న రమేష్ బాబు. అదే సమయంలో అటు హీరో కృష్ణ చిన్న కొడుకు మహేష్ ని కూడా బాల నటుడిగా పరిచయం చేసాడు. బాల నటుడిగా కూడా అప్పట్లోనే మంచి ఉత్సాహంతో అందరిని ఆకట్టుకున్నాడు మహేష్. ఆ తరువాత చదువుకోసం కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ హీరోగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆగస్టు 9 -1974 లో పుట్టిన మహేష్ హీరోగా పరిచయం అయిన మొదటి సినిమాతోనే ఘట్టమనేని అభిమానులనే కాకుండా అందరిని ఆకట్టుకున్నాడు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుని మహేష్ కెరీర్ కి మంచి ఊపునిచ్చింది. మహేష్ బాబు కెరీర్ మొదటి నుండి కూడా భిన్నమైన కథలవైపు ఫోకస్ పెట్టాడు. రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా ఉన్నాడు మహేష్. మొదటి సినిమా రాకుమారుడు తోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు (1999) అందుకున్నాడు మహేష్. ఆ తరువాత యువరాజు, వంశీ సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందించలేదు. అయితే వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ తో మహేష్ ప్రేమాయణం మొదలైంది ఆ సినిమాతోనే. ఆ తరువాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక మహేష్ కి హీరోగా మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది మాత్రం మురారి సినిమా. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సంచలన విజయాన్ని అందుకుని మహేష్ కి మొదటి సూపర్ హిట్టిచ్చింది. మహేష్ కి సొంతంగా అభిమానులు ఏర్పడడం మొదలయింది మురారి సినిమాతోనే. ఆ సినిమాతో మహేష్ స్టార్ హీరోల సరసన నిలబడేలా చేసింది.

ఆ తరువాత టక్కరి దొంగ అంటూ ఓ కౌబాయ్ సినిమా చేసాడు మహేష్, అది ఆశించిన స్థాయి హిట్ కాలేక ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత తేజ దర్శకత్వంలో సమాజంలోని లంచగొండితనాన్ని ఎదురించే సోషల్ మెసెజ్ ఉన్న కథతో నిజం అనే సినిమా చేసాడు. అదికూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక మహేష్ లోని టాలెంట్ ని బయటపెట్టిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు భారీ విజయాన్ని అందుకుని మహేష్ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. ఒక్కడు సినిమా విడుదలైన దాదాపు అన్ని సెంటర్స్ లో వందరోజులు ప్రదర్షింపబడి సంచలనం క్రియేట్ చేసింది. ఒక్కడు దెబ్బతో అటు బాక్స్ ఆఫీస్ ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు మహేష్. ఇక ఆ తరువాత నాని, మళ్ళీ అదే దర్శకుడు గుణశేఖర్ తో చేసిన అర్జున్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒక్కడు సినిమాతో ఉత్తమ తెలుగు నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు మహేష్.

ఇక మహేష్ ని మరోసారి తన సత్తా చాటుకునేలా చేసింది అతడు సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఉందంటూ ప్రశంశలను అందుకుంది. అంతే కాదు మహేష్ లోని నటుడిని బయటపెట్టిన సినిమా ఇదే. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా బంగారు నంది అందుకున్నాడు మహేష్. ఎన్ని సినిమాలు చేసిన మహేష్ ని హీరోగానే నిలబెట్టాయి తప్ప .. పెద్ద స్టార్ ని మాత్రం చేయలేకపోయాయి.. మహేష్ లో ఉన్న ఆ లోటుని భర్తీ చేసింది .. పోకిరి? క్రేజీ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సంచలన విజయం అందుకుంది .. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ని తుడిచిపెట్టింది పోకిరి. కట్ చేస్తే .. మహేష్ స్టామినా ఏమిటో అందరికి అర్థం అవ్వడంతో అయనను సూపర్ గా మార్చేసారు ప్రేక్షకులు. పోకిరి సినిమా మహేష్ కెరీర్ ని టర్న్ చేసింది. ఈ సినిమా అటు హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా భారీ విజయాలను అందుకోవడం విశేషం.

ఆ సినిమా తరువాత మహేష్ వెనక్కి చూసుకోలేదు. అయన కెరీర్ లో వరుసగా సంచలన విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోయాడు. ఆ తరువాత సైనికుడు, అతిది, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖలేజా సినిమాలు మహేష్ క్రేజ్ కు కాస్త బ్రేక్ వేసాయి. అయితే ఆ సినిమాలు కూడా మంచి కంటెంట్ తో చేసినవే కాబట్టి యావరేజ్ హిట్స్ గా మిగిలాయి. వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ మహేష్ దూకుడుని చూపించిన దూకుడు సంచలన విజయాన్ని అందుకుంది. దూకుడు సినిమా కూడా దాదాపు ఇండస్ట్రీ రికార్డులను అందుకునే దిశగా ముందుకు సాగింది. ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఆ వెంటనే క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే విమర్శకుల ప్రశంశలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు, సంచలన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సంచలన విజయాన్ని అందుకుని మహేష్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అదే దర్శకుడు తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమా కూడా భారీ విజయాలను అందుకున్నాయి.

తాజాగా మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా పై మహేష్ ఫాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మహర్షి సినిమా మరో పవర్ ఫుల్ సోషల్ మెసెజ్ తో తెరకెక్కుతుంది. అటు మహేష్ కూడా ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటైర్ టైనర్ ని చేసే ఆలోచనలో భాగంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. అన్నట్టు ఈ సినిమాలో మహేష్ విజయ్ జోసెఫ్ అనే పేరుతొ కనిపిస్తాడట. ఇందులో అత్తగా మాజీ హీరోయిన్ విజయ శాంతి నటిస్తుండగా .. తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారట.