దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ మధ్య డ్రగ్స్ కేసుకి సంబంధించి విచారణ ఎదుర్కొన్నాడు. ఆయనతోపాటు పలువురు సినీ ప్రముఖులు అప్పట్లో తెలంగాణ ఎక్సయిజ్ ‘సిట్’ యెదుట హాజరైన విషయం విదితమే. అది రియల్ ‘డ్రగ్స్’ వ్యవహారం. ఇక్కడ, మేటర్ అది కాదు. ఇది ప్యాషన్‌కి సంబంధించిన విషయం. సినిమా అంటే పూరి జగన్నాథ్‌కి ప్యాషన్. ఆయనతో ఎవరు వర్క్ చేసినా, వారికి ఓ రకమైన ‘కిక్’ లభిస్తుంది. ఆ ‘కిక్’ని ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ‘కిక్కు’లోనే, పూరి జగన్నాథ్‌ని ‘డ్రగ్’ అని అభివర్ణించాడు ఈ యంగ్ హీరో.
ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోన్న విషయం విదితమే. రామ్ పోతినేనితో నభా నటేష్, నిధి అగర్వాల్ రొమాన్స్ చేస్తున్నారు ఈ సినిమాలో. ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ‘ఇస్మార్ట్ బోనాలు’ పేరుతో వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. ఇక, తాజాగా సినిమాని చూసిన రామ్ పోతినేని, తెరపై తనను తాను చూసుకుంటే తెలియని కొత్త అనుభవం కలిగిందని, తెరపై అంత అగ్రెసివ్‌గా తనను తాను చూసుకునేసరికి ఆశ్చర్యపోయాననీ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో పూరి జగన్నాథ్‌ని ‘డ్రగ్’గా అభివర్ణించేసరికి, పూరి నుంచి కూడా స్పందన వచ్చింది.
‘డ్రగ్’ అన్నందుకు హ్యాపీ.. అని చెబుతూనే, తనకూ ‘కిక్’ లభించిందన్నాడు పూరి జగన్నాథ్. ఆ ‘కిక్కు’కి కారణం రామ్ పోతినేని అట. రామ్ ఎనర్జీతోనే ఇస్మార్ట్ శంకర్ ఇంత గొప్పగా వచ్చిందని పూరి చెప్పాడు. సినిమా పూర్తయ్యాక రామ్ ఇచ్చిన హగ్‌ని పూరి ఎప్పటికీ మర్చిపోలేడట.
DRUG is a biggest compliment for me.. but I got kick coz of you. It’s ur energy that made ismart Shankar kickass.. the hug u gave me after the movie I never forget.. you are an amazing actor. ?? Maaki kiri kiri .. we r going to rock man. Lov u RAPO https://t.co/JzfM2HMQWG
— PURIJAGAN (@purijagan) July 11, 2019
మరోపక్క, నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్వీట్ చేస్తూ, ఫైనల్ కాపీ చూశాక సినిమాపై నమ్మకం రెండింతలయ్యిందని చెప్పింది. ‘శంకర్ ఐ లవ్ యూ’ అని ఓ ఫన్ టచ్ కూడా ఇచ్చింది. ‘రామ్.. నువ్వు తురుమ్ రా..’ అని పేర్కొంది. అంతేనా, ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుందంటూ సీక్వెల్ విషయాన్ని బయటపెట్టింది ఛార్మి. ‘దీనెమ్మా కిక్కు..’ అంటూ రామ్ తన ట్వీట్లో పేర్కొనడం ఈ ట్వీట్ల ప్రసహనానికే హైలైట్. ఇదీ పూరి జగన్నాథ్ అనబడే డ్రగ్గు తాలూకు కథ.
606603 852586Hello! I could have sworn Ive been to this web site before but right after browsing through some of the post I realized it is new to me. Nonetheless, Im certainly pleased I identified it and Ill be book-marking and checking back regularly! 9376
317561 686557I think this really is best for you: Soccer, Football, Highlight, Live Streaming 331502
5600 487162What a lovely blog page. I will certainly be back again. Please keep writing! 315211
613688 658370I gotta favorite this internet site it seems quite beneficial . 810106