హైదరాబాద్ లో రాజకీయాలు రచ్చ లేపుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య మాటల తూటాలు పేలగా.. మరో ఘటనలో బీజేపీ నాయకురాలిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడికి దిగడం స్థానికంగా సంచలనం రేపింది. నేరేడ్ మెట్ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవికి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒకరిపై మరొకరు తీవ్ర అభియోగాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అధికార బలంతో తమపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్టే అధికారులు వింటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అక్రమ నిర్మాణాలపై తాము 34 ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. యాప్రాల్ లో తన భర్త మధుసూదన్ రెడ్డి ఇతర భాగస్వాములతో కలిసి కొనుగోలు చేసిన భూమిని ఎమ్మెల్యేకి ఇవ్వనందునే ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, వీటిని మైనంపల్లి తోసిపుచ్చారు. అక్రమాలకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా కార్పొరేటర్ శ్రీదేవిని ఆమె భర్తను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. మరో ఘటనలో జగద్గిరిగుట్ట మగ్ధూంనగర్ కార్పొరేటర్ జగన్ పై బీజేపీ నాయకురాలు వసుంధర ఫిర్యాదు చేశారు.
జగన్ ఇంటికి సమీపంలోనే వసుంధర ఉంటున్నారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో గతంలో వసుంధరపై టీఆర్ఎస్ కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో ఓ ఫంక్షన్ కు బంధువులు రాగా.. మద్యం మత్తులో ఉన్న జగన్ వారిపై దాడి చేశారు. ఆపడానికి వెళ్లిన వసుంధరపైనా దాడికి దిగారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం పలువురు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళన చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
633036 427672Precisely what I was searching for, thankyou for putting up. 598758
988902 978326I actually prize your work , Excellent post. 54427
808770 717058You should be very astute at research and writing. This shows up in your original and distinctive content material. I agree together with your primary points on this topic. This content material need to be seen by more readers. 57929
582013 477646I believe you did an awesome job explaining it. Sure beats having to research it on my own. Thanks 514880
522591 365365Outstanding post, I conceive weblog owners really should acquire a lot from this weblog its really user pleasant. 782418
60867 161023Hello there! I could have sworn Ive been to this weblog before but after reading by way of some with the post I realized its new to me. Anyhow, Im surely happy I discovered it and Ill be book-marking and checking back frequently! 880903