Switch to English

పరీక్షల్లో జగన్ కాపీ కొడుతున్నప్పుడు దేశం గురించి ఆలోచిస్తున్నా: పవన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర సందర్భంగా, వైఎస్ జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రూపాయి పావలా ముఖ్యమంత్రిగా అభివర్ణించిన జనసేనాని, వైసీపీ ప్రభుత్వాన్ని రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

నెల్లూరులో నా చిన్నప్పుడు రూపాయి పావలా బొమ్మల పేరుతో కొందరు వ్యాపారం చేసేవారనీ, రూపాయి పావలా దాచుకుని వెళితే.. అక్కడ ఆ ధరకి ఒక్క బొమ్మ కూడా దొరికేది కాదనీ, వైఎస్ జగన్ సర్కారు చెబుతున్న నవరత్నాల వ్యవహారం కూడా అలాంటిదేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

టీడీపీ – జనసేన పార్టీలు కలిసింది, వైఎస్ జగన్‌ని అధికార పీఠం నుంచి దించడానికి మాత్రమే కాదు, శాశ్వతంగా వైఎస్ జగన్ రాజకీయాల్లో వుండటానికి వీల్లేకుండా చేయడానికని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

కేవలం రాష్ట్రం కోసమే టీడీపీతో జనసేన జతకట్టిందన్న జనసేనాని, టీడీపీ అనుభవానికి జనసేన పోరాట పటిమ తోడైతే, రాష్ట్ర రాజకీయాల్లో అద్భుతాలు జరుగుతాయనీ, జనసేన – టీడీపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిథి దోపిడీకి, విలువైన వనరులు నాశనమవుతున్నాయనీ, అన్నిట్లోనూ కమిషన్లు కొట్టేస్తూ, ప్రజల్ని పీడిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇసుక దోపిడీ సహా, వివిధ పనులకు సంబంధించి స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిథులు వసూళ్ళు చేస్తోన్న వాటాల్ని సవివరంగా జనసేనాని ప్రస్తావించారు.

మరోపక్క, పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రకు సంబంధించి అధికార వైసీపీ కుట్రలు చేస్తోందనీ, అసాంఘీక శక్తులు వారాహి విజయ యాత్రపై దాడికి సిద్ధమవుతోందనీ జనసేనాని ఆరోపించడంపై, పోలీస్ ఉన్నతాధికారులు గుస్సా అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలంటూ, నోటీసులు పంపించారు.

ఈ నోటీసులపై జనసేనాని వారాహి విజయ యాత్ర సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హైద్రాబాద్ నుంచి విజయవాడకు ఇటీవల తాను వస్తున్నప్పుడు, తన పార్టీ కార్యాలయానికి తాను వెళుతోంటే, చంద్రబాబుకి సంఘీభావం పలకడం కోసం ఏసీబీ కోర్టుకు వెళుతున్నట్లుగా పోలీసు శాఖకు ఎలా సమాచారం అందిందంటూ జనసేనాని ప్రశ్నించారు.

జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాను వెళ్ళకుండా, తనను అడ్డుకునే ప్రయత్నం పోలీసులే చేశారన్న జనసేనాని, ఇదేం పద్ధతి.? వైసీపీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పని చెయ్యాలంటూ పోలీసు శాఖలో కొందరు అధికారుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జనసేనాని.

‘వైఎస్ జగన్.. నువ్వు పరీక్షకల్లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం గురించి ఆలోచించిన వ్యక్తిని..’ అంటూ ఎద్దేవా చేసిన జనసేనాని, ‘పార్లమెంటులో సోనియాగాంధీకి కనిపించకుండా ప్లకార్డులు రివర్సులో పట్టుకుని, చాటుగా నినదించిన వైఎస్ జగన్, సోనియాగాంధీని ఎదిరించానని ఇప్పుడు చెబుతున్నారు..’ అంటూ వెటకారం చేయడం కొసమెరుపు.

2 COMMENTS

  1. Howdy! I kno this iis kinda offf topic nevertueless I’d
    ffigured I’d ask. Woukd youu bbe interesed iin exchangig links or aybe gues authoring a bloig post oor vice-versa?

    My blg goes ovrr a lot oof the same subjects as youurs and I feel wwe could greatly benedfit
    from each other. If you happen to bee interesated fesel free to send mme ann email.

    I loik forward to heaeing fro you! Fantastic blog bby thhe way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

సినిమాకి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇకపై అంతా శుభమేనా.?

తెలుగు సినిమా గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనేక అవమానాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్‌కి సంబంధించిన సినిమాలు కావొచ్చు, మెగా హీరోలకు మద్దతుదా నిలిచే హీరోల...

Daily Horoscope: రాశి ఫలాలు: అదివారం 16 జూన్ 2024

పంచాంగం తేదీ 16- 06-2024, అదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల దశమి రాత్రి 2.31...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం ఉండాల్సిందే. దానికి ప్రేమ, అభిమానం, భక్తి...