కమెడియన్ ఆలీ నటించిన లేటెస్ట్ మూవీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ బాగానే చేశారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్‌లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో ఆలీతో వీరిద్దరు కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆలీ పెళ్లికి సంబంధించి ఓ టాపిక్ రాగా, ఈ పెళ్లి సీన్ చూసి ఆలీ భార్య ఎలా ఫీల్ అయ్యిందని నరేశ్ అడిగాడు. అయితే ‘‘ఏముంది.. చాలా సినిమాల్లో ఆలీ పెళ్లి జరిగిందిగా.. ఆమె ఏం ఫీలవదు’’ అంటూ పవిత్రా లోకేశ్ వెనకేసుకొచ్చింది. దీంతో నరేశ్ అసలు బండారం బయటపెట్టాడు.
ఆలీ పెళ్లి ఇలా జరగలేదని.. పెళ్లి కోసం బ్రేక్ ఇవ్వలేదని.. బ్రేక్ ఇచ్చి ఆలీ ఫస్ట్ నైట్ జరిపి తీసుకొచ్చారని నరేశ్ చెప్పుకొచ్చాడు. దీంతో పవిత్రా పగలబడి నవ్వింది. అయితే ఈ విషయాలను మనం తరువాత మాట్లాడుకుందాం అంటూ ఆలీ మాట మార్చడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏదేమైనా ఈ విధంగా ఆలీ ఫస్ట్ నైట్ బండారాన్ని నరేశ్ బయటపెట్టడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఎంతైనా పవిత్రా పక్కన ఉంటే నరేశ్ వెరీ నాటీ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
322721 736382After study several with the weblog posts on your own website now, we really like your way of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware if you agree. 842057
597019 698755Yay google is my king aided me to discover this excellent website ! . 833964