బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షేర్ చేసి చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు. షారుఖ్ ఖాన్ యొక్క యాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు నెవ్వర్ బిఫోర్ ఉండబోతున్నాయని ఆశిస్తున్నట్లుగా రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. దీపికా పదుకునే హీరోయిన్ గా పటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో జాన్ అబ్రహం నటించిన విషయం తెల్సిందే. హిందీతో పాటు తెలుగు మరియు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. కానీ షారుఖ్ ఖాన్ యొక్క సినిమా యొక్క ట్రైలర్ ను రామ్ చరణ్ షేర్ చేసి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ట్వీట్ చేయడం ఫ్యాన్స్ తో పాటు అందరిని కూడా ఆశ్చర్య పర్చింది. చరణ్ ట్వీట్ తో పఠాన్ కు తెలుగు లో కచ్చితంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Wishing the whole team of #Pathaan all the very best!@iamsrk Sir looking fwd to seeing you in action sequences like never before! #PathaanTrailerhttps://t.co/63G1CC4R20 @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MTQBfYUfjg
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023
597892 550133I truly treasure your piece of work, Great post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 600142