మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా క్రాక్. ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జనవరి 9న క్రాక్ విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటించిన విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే.
ఇక క్రాక్ నుండి మరో సాంగ్ ను ఈరోజు విడుదల చేస్తారు. మాస్ బిర్యానీ పేరుతో విడుదలైన ఈ సాంగ్ ట్రెండీగా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ చాలా అట్ట్రాక్టీవ్ గా ఉన్నాయి. మాస్ సాంగ్స్ కు పెట్టింది పేరైన కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ను పవర్ ను చూపించాడు.
రాహుల్ నంబియార్, సాహితి చాగంటి ఈ పాటను పాడారు. ఇక ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం మరోసారి ట్రెండ్ ను తగ్గట్లుగా సాగింది. రవితేజకు డ్యాన్స్ చేయడానికి మంచి స్కోప్ ను ఇచ్చింది ఈ సాంగ్.
555470 470542dog grooming could be the specialty of my sister, she really loves grooming every dog in our house 335788