కన్నడ రాకీంగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కేజీఎఫ్ కు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతోంది. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంని అంటున్నారు. షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా టీజర్ ను వచ్చే నెల 8వ తారీకున ఉదయం 10.18 కి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. నేడు కేజీఎఫ్ ఛాప్టర్ 1 విడుదలైన రోజు. కనుక నేడు కేజీఎఫ్ 2 సినిమా టీజర్ లాంచింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంతో అంచనాల నడుమ జరిగింది. కన్నడ సినిమా పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా లో సంజయ్ దత్ నటించడం వల్ల సినిమా అంచనాలు మరింతగా పెరిగాయి.
946462 667764Hello! Ive been following your blog for a while now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention maintain up the very good function! 715309
160831 265637Aw, it was an really very good post. In thought I would like to set up writing comparable to this additionally – taking time and actual effort to create a quite very good article but exactly what do I say I procrastinate alot and also no means manage to go done. 360942