Switch to English

జగన్‌ ఎఫెక్ట్‌: కత్తి గాటు.. అధికారులపై వేటు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాత్రికి రాత్రి డీజీపీ మార్పు జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌పై బదిలీ వేటు పడింది. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుపైన కూడా బదిలీ వేటు పడటం గమనార్హం. ఠాకూర్‌ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ కొత్త డీజీపీగా ఎంపికయ్యారు. కాగా, ఠాకూర్‌, వెంకటేశ్వరరావు ఇద్దరూ చంద్రబాబు హయాంలో అధికార పార్టీకి వత్తాసు పలికారన్న ఆరోపణల్ని ఎదుర్కొన్నవారే.

ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు పడింది. అప్పటికి ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వ్యవహరించేవారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా వైఎస్సార్సీపీ, వెంకటేశ్వరరావుపై వేటు వేయించగలిగింది. ఇప్పుడు పూర్తిగా అధికారమే తమ చేతుల్లోకి వచ్చాక ఊరుకుంటారా.? అధికారంలోకి వస్తూనే తమకు అనుకూలంగా వుండే అధికారులకు పెద్ద పీట వేస్తూ, నచ్చని అధికారుల్ని ‘దూరంగా వుంచే’ కార్యక్రమాన్ని షురూ చేశారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ మాటకొస్తే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి వ్యవహారాలు మామూలే అయినా, కాస్తంత కూడా టైమ్‌ తీసుకోకుండా అత్యంత వేగంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వైఎస్‌ జగన్‌ వివాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు.

ఆర్పీ ఠాకూర్‌ విషయానికొస్తే, ఈయన్ని డీజీపీ పదవిలోంచి తప్పించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కార్‌, ఆర్పీ ఠాకూర్‌కి పూర్తిస్థాయిలో అండదండలు అందించింది. మరీ ముఖ్యంగా కోడి కత్తి ఎపిసోడ్‌లో ఠాకూర్‌ అత్యుత్సాహం వివాదాస్పదమయినా, టీడీపీ ఆయన్ని వెనకేసుకొచ్చింది. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే, దాన్ని పబ్లిసిటీ కోసం చేసిన దాడిగా అభివర్ణించి ఠాకూర్‌ వివాదాల్లోకెక్కారు. అఫ్‌కోర్స్‌, ఆ కేసు విచారణ ఎన్‌ఐఏ తమ చేతుల్లోకి తీసుకున్నా, ఇప్పటిదాకా ఆ కేసుకి సంబంధించి పూర్తి వాస్తవాలు ప్రజల ముందుకు రాలేదనుకోండి. అది వేరే సంగతి. ఆ కోడి కత్తి ఎపిసోడ్‌, ఇప్పుడు ఠాకూర్‌పై వేటు పడేలా చేసింది. ఆ ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ వైఫల్యంపైనా వైఎస్సార్సీపీ అప్పట్లో చాలా యాగీ చేసింది. ఇప్పుడు అవకాశం వచ్చింది గనుక, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుపై ఇప్పుడు బదిలీ పేరుతో చర్యలు తీసుకుందని భావించాలేమో.

పరిపాలన సంగతేమోగానీ, ముందైతే అధికారుల బదిలీల పేరుతో వేటు వేయడంలో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యుత్సాహం చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుంటే, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వైఎస్‌ జగన్‌ ఈ రోజు సమీక్షలు నిర్వహించబోతున్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాల్ని విడుదల చేయడానికి సంకల్పించుకున్న వైఎస్‌ జగన్‌, శ్వేత పత్రాల విడుదల తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెడతారట. మరోపక్క, మంత్రి వర్గ కూర్పు విషయమై పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. వారం రోజుల్లోనే మంత్రి వర్గ కూర్పు విషయమై ఓ క్లారిటీ రాబోతోందట. ఆ వెంటనే, అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...