Switch to English

Home స్పోర్ట్స్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే ..

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే ..

0
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే ..
WhatsApp-Image-2019-05-01-at-5.21.14-PM
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడికి బహుమతిగా ఆరెంజ్ క్యాప్ ని అందిస్తారు . ఇప్పటికి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్ లో కలిపి విదేశీ ఆటగాళ్లు 8 సార్లు ఈ క్యాప్ ని దక్కిచుకోగా , భారత బ్యాట్స్ మెన్ లు 3 సార్లు అందుకున్నారు .

2008 – షాన్ మార్ష్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( 616 పరుగులు )

ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ ఐపీఎల్ మొదటి సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 11 ఇన్నింగ్స్ లు ఆడిన షాన్ మార్ష్ 68.44 సగటు తో 616 పరుగులు చేసి ఆ ఏడాది అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానం లో నిలిచి ఆరెంజ్ క్యాప్ విజేత గా నిలిచాడు..

2009 – మాథ్యూ హేడెన్ – చెన్నై సూపర్ కింగ్స్ ( 572 పరుగులు )

ఆస్ట్రేలియన్ మాజీ ఆట గాడు మాథ్యూ హేడెన్ ఐపీఎల్ లో చెన్నై తరుపున ప్రాతినిధ్యం వహించాడు , ఈ స్టైలిష్ ఓపెనర్ రెండవ ఐపీఎల్ సీజన్ లో 54 సగటుతో 572 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని దక్కిచుకున్నాడు..

2010 – సచిన్ టెండూల్కర్ – ముంబై ఇండియన్స్ ( 618 పరుగులు )

భారత స్టార్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 2010 ఐపీఎల్ సీజన్ లో యువ క్రికెటర్లకు దీటుగా బ్యాటింగ్ చేసి 48 సగటుతో 618 పరుగులు చేసాడు. ఆరెంజ్ క్యాప్ దక్కిచుకున్న మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు.ఇందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం

2011 – క్రిస్ గేల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 608 పరుగులు )

మొదటి మూడు ఐపీఎల్ సీజన్ లలో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన గేల్ పెద్దగా రాణించకపోవడం తో బెంగుళూరు జట్టు అతన్ని 4 వ ఐపీఎల్ సీజన్ కోసం జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్ లో సిరిస్ గేల్ రెండు సెంచరీలతో పాటు 68 సగటుతో 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు.

2012 – క్రిస్ గేల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 733 పరుగులు )

2011 సీజన్లో మాదిరిగానే 2012 లో చెలరేగిపోయాడు గేల్ ఏకంగా 59 సిక్సర్ల తో పాటు 61 సగటుతో 733 పరుగులు చేసి వరుసగా 2 వ సారి ఆరెంజ్ క్యాప్ ని పొందాడు.

2013 – మైఖేల్ హస్సీ – చెన్నై సూపర్ కింగ్స్ ( 733 పరుగులు )

మైక్ హస్సీ ని క్రికెట్ అభిమానులు ” మిస్టర్ క్రికెట్ ” అని పిలుచుకుంటారు. 2013 లో చెన్నై కి ఆడిన ఈ ఆటగాడి వయస్సు అప్పటికే వయస్సు 35 ఏళ్ళు ఉన్నాయి అయిన ఆ సీజన్లో 52 సగటుతో 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నారు.

2014 – రాబిన్ ఉతప్ప – కోల్ కత్తా నైట్ రైడర్స్ ( 660 పరుగులు )

రాబిన్ ఉతప్ప 7 వ ఐపీఎల్ సీజన్ల కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు , ఈ సీజన్లో అతడు వరసగా 8 సార్లు 40 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసాడు . సీజన్ మొత్తం లో 52 సగటుతో టోర్నమెంట్ లో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న రెండవ భారత ఆట గాడిగా నిలిచాడు..

2015 – డేవిడ్ వార్నర్ – సన్ రైజర్స్ హైదరాబాద్ ( 572 పరుగులు )

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2015 లో సన్ రైజర్స్ తరుపున ఆడాడు. ఈ సీజన్ లో అతడు 572 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ని అందుకున్నాడు .

2016 – విరాట్ కోహ్లీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 973 పరుగులు )

2016 ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్ లలో 4 సెంచరీ లు చేసాడు. అప్పటి వరకు ఉన్న ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డ్ కన్నా 240 పరుగులు ఎక్కువగా చేసి 81 సగటుతో 973 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు.

2017 – డేవిడ్ వార్నర్ – సన్ రైజర్స్ హైదరాబాద్ ( 641 పరుగులు )

డేవిడ్ వార్నర్ 2017 ఐపీఎల్ సీజన్లో 641 పరుగులు చేసి రెండవ సారి ఆరెంజ్ క్యాప్ ని సొంత చేసుకున్నాడు.

2018 – కేన్ విలియమ్సన్ – సన్ రైజర్స్ హైదరాబాద్ ( 735 పరుగులు )

డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోయేసరికి సన్ రైజర్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విలియమ్సన్ 11 వ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఈ సీజన్లో 53 సగటుతో 735 పరుగులు చేసి తొలిసారి ఆరెంజ్ క్యాప్ ని అందుకున్నాడు