ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత చర్చ జరుగుతున్న సినిమా ఏదైనా ఉంటె అది రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ చిత్రం #RRR . రామ్ చరణ్ , రామ రావు (Jr ఎన్టీఆర్ ) లు నటిస్తుండడం తో సినిమా కి ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా #RRR అని పేరు పెట్టారు . ఈ మధ్య సినిమాకి సంబంధించి జరిగిన అధికారిక ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా కి కొన్ని టైటిల్స్ అనుకుంటున్నామని కానీ సినిమాని దేశ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేసే విధంగా టైటిల్ ఉండాలి అని తెలిపారు. అదే విధంగా ఈ సినిమా కి సంబంధించి టైటిల్స్ ని అభిమానుల నుండి కూడా కోరారు ఒకవేళ వారు పంపించే టైటిల్స్ లో ఏదైనా సినిమా కి తగట్టు ఉంటె దానినే టైటిల్ గా ఫిక్స్ చేస్తామని రాజమౌళి పేర్కొన్నారు .
అలాగే మూవీ కి సంబందించిన టైటిల్స్‌ను సూచించాలని #RRR మూవీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కూడా ప్రేక్షకులను చిత్ర యూనిట్ కోరింది. దీంతో చాలా మంది తమకు తోచిన టైటిల్స్‌ను సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల నుంచి ట్విట్టర్‌లో టైటిళ్ల వర్షం కురిసింది. ఈ వర్షంపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. కొన్ని టైటిళ్లను తీసుకొని వాటిని ఒక ఇమేజ్ రూపంలో తయారుచేసి ట్విట్టర్‌లో పెట్టింది.
అభిమానులు పంపిన కొన్ని ఆశక్తికర టైటిల్స్ ఇవే ..
1. రాముడు రుద్రుడు రణరంగం
2. రణం రౌద్రం రాజసం
3. రామ రావణ రణరంగం
4. రాజ్యం రణం రక్తం
5. రోషం రౌద్రం రాజసం
6. రామ రాజ్య రక్షకులు
7. రణ రామ రాజు
8. రాజ్యం కోరని రాజుల రణగాధ
9. రామభీమ రణరంగం
10. రఘుపతి రాఘవ రాజారాం