అవయువ దానం చేసిన వారి అవయువాల తరలింపు కోసం పోలీసులు సాయంతో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేస్తారు. రోడ్డు మార్గంలో.. అక్కడి నుంచి దూరమైతే హెలికాఫ్టర్లలో అవయువాలు తరలిస్తారు. అయితే.. దేశంలోనే తొలిసారిగా దానం చేసిన అవయువాలను మెట్రో రైల్ ద్వారా తరలించారు. ఇందుకు హైదరాబాద్ మెట్రో ముఖ్య పాత్ర పోషించింది. జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో ఓ వ్యక్తికి గుండె ఆపరేషన్ జరుగనుంది. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు కుటుంబసభ్యులు.
దీంతో ఎల్టీనగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ వరకూ రోడ్డు మార్గంలో గుండెను తరలించారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ వరకూ మెట్రోలో.. అక్కడి నుంచి మళ్లీ అపోలో ఆసుపత్రి వరకూ రోడ్డు మార్గంలో గుండెను తరలించారు. ఇందుకు పోలీసులు మెట్రో, రోడ్డు మార్గంలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు మెట్రోను ఎంచుకున్నారు అధికారులు. మెట్రో అధికారులు ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ మెట్రో ఓ గుండె ఆపరేషన్ కు కీలక సాయం చేసినట్టైంది.
568707 88977I gotta favorite this web site it seems handy quite useful 531703
998578 556206I genuinely got into this post. I located it to be intriguing and loaded with exclusive points of interest. I like to read material that makes me believe. Thank you for writing this excellent content. 496213
534430 795957Yeah bookmaking this wasnt a bad conclusion excellent post! . 169572