Switch to English

Home సినిమా స్పెషల్: సైరా రివ్యూ- మెగా ఫాన్స్ గర్వంగా ఫిలయ్యే సినిమా.!

స్పెషల్: సైరా రివ్యూ- మెగా ఫాన్స్ గర్వంగా ఫిలయ్యే సినిమా.!

0
స్పెషల్: సైరా రివ్యూ-  మెగా ఫాన్స్ గర్వంగా ఫిలయ్యే సినిమా.!
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోని చిరకాల కోరిక తీరింది మరియు తన ఆకలి తీరిపోయింది అని చెప్పుకుంటున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సుమారు 275 కోట్ల బడ్జెట్ తో చిరంజీవితో పాటు అల్ ఇండియన్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, జగపతి బాబు, నయనతార, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలు పోషించిన ‘సైరా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాకి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

For Sye Raa USA Premiere Show English Live Updates click this link

మా telugubulletin.com కి దగ్గరి వారు ‘సైరా’ని చూసి మాకు చెప్పిన కంప్లీట్ రిపోర్ట్ ని మీకు షార్ట్ రివ్యూగా అందిస్తున్నాం.

కథ:

1830-40లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యం గురించి, అప్పట్లోనే ఆయన డ్రీమ్స్ ఎలా ఉండేవి అని చెప్తూ కథని మొదలవుతుంది. అలాగే ఆ ఊరి పెద్దలా మంచి స్థానంలో ఉన్న ఫ్యామిలీలో నరసింహారెడ్డి జీవితం ఎలా ఉండేది, అలాగే తన ప్యాలస్ లో జరిగిన కుట్రలను అడ్డుకుని ప్రజల యోగ క్షేమాలు చూసుకునే టైంలో బ్రిటిష్ వారి అరాచకాలు విపరీతం అవుతాయి. ఆ సమయంలో ప్రజలవైపు నిలబడి నరసింహారెడ్డి బ్రిటిష్ వారి సంపాదనే దోచేసి బందిపోటు అవ్వడం, అలాగే బిటిష్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేసి స్వాతంత్రం కోసం ఎలా వీరోచిత పోరాటం చేసి, తన ప్రాణాలను త్యజించాడు అన్నదే కథ.

For Sye Raa USA Premiere Show Telugu Live Updates click this link

‘సీటీమార్’ మోమెంట్స్:

  • మొదటి 10 నిమిషాలు: కొన్ని అద్భుతమైన విజువల్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో కథ మొదలయ్యే విధానం సూపర్బ్. మొదటి 10 నిమిషాల్లోనే ‘సైరా’ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది.

  • మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్: చిరంజీవిని సైరా నరసింహారెడ్డి గా కథకి పరిచయం చేసే బ్లాక్ మెగా అభిమానులని సీట్లో కోర్చోనివ్వకుండా గోల చేయిస్తే, కామన్ ఆడియన్స్ కూడా ఫెంటాస్టిక్ అనేలా ఉంటుంది.

  • ఇంటర్వల్ బ్లాక్: బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకి సై అన్న సమయంలో, 30 ఇయర్స్ పృథ్వి సైరా నరసింహారెడ్డి కి ఇచ్చే ఎలివేషన్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వల్ టైం కి మంచి కిక్ ఇస్తుంది.

  • రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ : మొదటగా పూర్తి నైట్ ఎఫెక్ట్ లో 35 రోజుల పాటు 70 కోట్ల బడ్జెట్ తో షూట్ చేసిన యాక్షన్ బ్లాక్ అద్భుతం.

  • ఇక రెండవది ప్రీ క్లైమాక్స్ దగ్గర అందరు స్టార్స్ కలిసి చేసే వీరోచిత యుద్ధం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది.

  • ఎమోషనల్ బ్లాక్స్: ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ ఎపిసోడ్, అలాగే ‘సైరా’ని ఉరి తీసే ముందు ఇచ్చే స్పీచ్ మరియు చివరిగా వచ్చే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఒక్కసారిగా ఆడియన్స్ ని ఎమోషనల్ గా హై ఫీలయ్యేలా చేస్తాయి.

  • హీరో ఎలివేషన్ సీన్స్: సినిమాలో కొన్ని చోట్ల దేశభక్తి గురించి, స్వాతంత్రం గురించి చెప్పే సీన్స్ తో పాటు బ్రిటిష్ వారికి వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో డైలాగ్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.

  • విఎఫ్ఎక్స్: ‘బాహుబలి’ కన్నా ఎక్కువగా చేసిన విజువల్ ఎఫెక్ట్ షాట్స్ సూపర్బ్.

బోరింగ్ ఎలిమెంట్స్:

సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కావున, స్వతహాగా మనమే ఇవి నెగటివ్ అవ్వచ్చేమో అని ఫీలవుతున్న విషయాలకి, మాకు తెలిసిన రిపోర్ట్ మిక్స్ చేసి ఒక 2 పాయింట్స్..

  • సినిమా నిడివి: 170 నిమిషాల నిడివి ‘సైరా’ లాంటి సినిమాకి కూడా ఎఫెక్ట్ అవ్వనుందని సమాచారం.

  • బోరింగ్ ఎలిమెంట్స్: ఫస్ట్ హాఫ్ మరియు సెకండాఫ్ లలో మేలో డ్రామా సీన్స్ కొన్ని బోర్ కొట్టేలా ఉంటాయని సమాచారం.

చివరి మాట: ‘సైరా’- మెగాస్టార్ కెరీర్ తో పాటు, మెగా అభిమానులు కూడా గొప్పగా ఫీలయ్యే సినిమా అవుతుంది.

ఎప్పటికప్పుడు సైరా’ కి సంబందించి అప్డేట్స్ మా telugubulletin.com లో అందిస్తున్నాం. సో మిస్ కావద్దు..