Switch to English

లైవ్ అప్ డేట్స్ : సైరా నరసింహ రెడ్డి యూఎస్ ప్రీమియర్ షో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ముగిసింది. మరి కాసేపట్లో పూర్తి రివ్యూ ఇస్తాం..

03.25 A.M IST: క్లైమాక్స్ లో సైరా తల్లి చెప్పే డైలాగ్స్, ఒక్కసారిగా అందరినీ హార్ట్ టచ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్ళిపోద్ది.

03.15 A.M IST: ‘సైరా’ బహిరంగ ఉరికి సర్వం సిద్ధం. పవర్ఫుల్ డైలాగ్స్ తో ఎమోషనల్ గా క్లైమాక్స్ ముగిసింది.

03.05 A.M IST: వార్ ఎపిసోడ్ తర్వాత వస్తున్న డ్రామా సీన్స్ బాగా స్లోగా ఉన్నాయి.

03.00 A.M IST: నరసింహా రెడ్డిని పట్టుకోవడం కోసం కథలో చిన్న ట్విస్ట్.. బ్రిటిష్ వారి చేతిలో సైరా..

02.55 A.M IST: నరసింహా రెడ్డి సైనికులకు – బ్రిటిష్ సైనికులకు భారీ యుద్ధం. ఈ వార్ ఎపిసోడ్ లుక్ హాలీవుడ్ ని తలపించేలా ఉంది. విజువల్స్ పరంగా, హీరోయిజం పరంగా మాస్  ఆడియన్స్ కి ఈ వార్ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది.

02.50 A.M IST: నరసింహారెడ్డి కోసం తమన్నా తన లైఫ్ ని త్యాగం చేసే సీన్ ఎమోషనల్ గా చాలా బాగుంది.

02.45 A.M IST: నరసింహా రెడ్డి తన తోటి వీరుల మధ్య జరిగే కొన్ని బోరింగ్ సీన్స్ జరుగుతున్నాయి. అలాగే సైరా తన బలగంలో ఉన్న వెన్నుపోటు దారులని వెతికి చంపే పనిలో ఉన్నాడు.

02.40 A.M IST: రాయలసీమ వీరులంతా కూడా నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడటానికి సిద్ధమయ్యారు. దాంతో రేనాటి ప్రాంతానికి నరసింహారెడ్డే స్వాతంత్య్రం ప్రకటించాడు.

02.35 A.M IST: విజయ్ సేతుపతి రాజ పాండిగా ఎంటర్ అయ్యాడు. తాను కూడా సైరాతో చేయి కలిపాడు. ప్రతి ఒక్కరిలోనూ పోరాట స్ఫూర్తిని నింపే ‘సైరా’ టైటిల్ సాంగ్ మొదలైంది. తమన్నా ఊరూరా ప్రదర్శనలిస్తూ అందరినీ సైరాకి సపోర్ట్ చేసేలా చేస్తోంది.

02.30 A.M IST: నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి దేశం వదిలి పారిపోండి లేదా యుద్ధమే అని పంపే వార్ లెటర్ సీన్ బాగుంది.

02.15 A.M IST: ఈ వార్ చివరిలో నరసింహారెడ్డికి సాయం చేయడానికి అవుకు రాజు అలియాస్ సుధీప్ ఎంటర్ అవుతాడు. బ్రిటిష్ వారితో యుద్దానికి సైరాతో అవుకు రాజు కూడా చేతులు కలుపుతారు.

02.10 A.M IST: ప్లాన్ చేసిన విధంగానే బ్రిటిషర్స్ నరసింహారెడ్డి కోటపై రాత్రి పూట దాడి ప్లాన్ చేస్తారు. దానికి నరసింహారెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తాడు. ఈ వార్ ని బాగా షూట్ చేశారు మెయిన్ గా ఇందులోని స్టంట్స్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.

02.05 A.M IST: సెకండాఫ్ నరసింహారెడ్డి తనతోటి పక్క సంస్థానాల వీరులను పిలిచి బ్రిటిష్ వారిపై పోరాడదాం అంటే ఎవ్వరు అంగీకారం తెలుపరు. అదే సమయంలో బ్రిటిష్ వారు కూడా నరసింహారెడ్డి పై పాగా తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తుంటారు.

02.00 A.M IST: ఇంటర్వల్ వార్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్ళి బ్రిటిష్ వారితో ఇక యుద్ధమే అని చెప్పి ఇంటర్వల్ ఇచ్చారు.

01.55 A.M IST: ఊపిరి బిగపట్టుకొని, పిడికిలి బిగించి కొట్టు నా డాష్ గాళ్ళని అని ఫీలవుతూ చూసే సీన్.. బ్రిటిష్ సైనికులపై నరసింహారెడ్డి చేసే వార్ థియేటర్ లో ప్రేక్షకులకి, అభిమానులకి పూనకాలు తెచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి జాక్సన్ తల తెచ్చి రేనాటి వీరులతో మాట్లాడే సీన్ మరియు డైలాగ్స్ ఆడియన్స్ కి చొక్కాలు చించుకుని రేంజ్ లో ఉంది. వీరుడిగా పోరాటాలు చేసే సీన్స్ లో చిరంజీవిని చూస్తుంటే ఒక 20 ఏళ్ళ క్రితం చూసిన చిరులా కనిపిస్తాడు.

01.50 A.M IST: బ్రిటిష్ వారు మన ఇండియన్స్ చేసే అరాచకాలకు అడ్డు లేకుండా ఐపోతుంది. ఆ సీన్స్ చూసే ఆడియన్స్ లో కూడా విప్లవ భావాన్ని కలిగిస్తాయి. ఆ అరాచకాలు చూసిన నరసింహారెడ్డి జాక్సన్ తలా తీసుకువస్తానని చేసే ఛాలెంజ్ అండ్ డైలాగ్స్ ఫెంటాస్టిక్. ఆ తర్వాత కాయిల్ కుంట్ల బ్రిటిష్ ఫోర్ట్ పై చిరంజీవి అటాక్ చేయడం అదిరింది. ఈ బ్లాక్ మాత్రం ఆడియన్స్ కి, అభిమానులకి రోమాలు నిక్కబొడుచుకునే ఫీలింగ్ ని కలిగిస్తుంది.

01.45 A.M IST: ఇప్పటి వరకూ నరసింహారెడ్డి జీవితం, ఆయన జీవితంలోని వారి గురించి పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే సైరా కథ బ్రిటిష్ వారిపై పోరాడే వీరుడిగా మారె దిశగా వెళ్తోంది.

01.40 A.M IST: ఓ అడవి జాతికి చెందిన అమ్మాయిగా నిహారికని పరిచయం చేసారు.

01.35 A.M IST: నరసింహారెడ్డి రేనాటి వ్యయసాయ భూముల్లో బ్రిటిష్ ఆఫీసర్ జాక్సన్ పై మొదటిసారి తిరుగుబాటు చేసే సీన్ అదిరింది. శిస్తు ఎందుకు కట్టాలిరా అనే డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫాన్స్  మరో సారి గోలచేసే సీన్ ఇది.

01.30 A.M IST: కాయిల్ కుంట్లప్రాంతానికి కొత్త బ్రిటిష్ ఆఫీసర్ అయినా జాక్సన్ ని నియమించారు. దారుణ చర్యలకు, అతి కిరాతకంగా మనుషులని హింసించడంలో అతను దిట్ట.

01.25 A.M IST: బ్రిటిష్ అసిస్టెంట్ రాఘవయ్య పాత్రలో రఘుబాబుని పరిచయం చేశారు.

01.22 A.M IST: ఇప్పటి వరకూ జరిగిన సినిమాలో అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. అలాగే కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి.

01.20 A.M IST: చిరంజీవి – తమన్నాల మధ్య వచ్చే లవ్ తరహా సీన్స్ బాగున్నాయి. వీరిద్దరి పెయిర్ కూడా చాలా బాగుంది. ఈ ప్రేమ తర్వాత చిరంజీవికి తెలుస్తుంది. తనకి చిన్నప్పుడే సిద్దమ్మ తో పెళ్ళైపోయిందని. సిద్దమ్మగా నయనతార బాగుంది.

01.15 A.M IST: సైరా ప్రాంతంలోని ఒక కుటుంబానికి చెందిన రోహిణి నరసింహారెడ్డి దగ్గరికి వచ్చి తమకి కలిగే బాధల గురించి చెప్పుకునే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది, కచ్చితంగా కళ్ళు చెమర్చుతాయి.

01.12 A.M IST: తమన్నా ఒక గుడిలో పనిచేసే నర్తకి.. అలాగే రాయలసీమ చుట్టు పక్కల సంస్థానాల పెద్దలుగా జగపతి బాబు, సుధీప్, బ్రహ్మాజీలు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకూ జరిగిన 40 నిమిషాల సినిమా బాగుంది. మంచి ఫ్లోలోనే వెళ్తోంది.

01.10 A.M IST: జాగో పాటలో తమన్నాని పరిచయం చేశారు. తన లుక్ చాలా బాగుంది. ఇది వరకూ తనని ఇలా చూడలేదు.

01.08 A.M IST: అలాగే కన్నడ రాజు అవుకు రాజుకి – నరసింహారెడ్డికి మధ్య ఉన్న కొన్ని విభేదాలను ఎస్టాబ్లిష్ చేశారు.

01.05 A.M IST: జల స్తంభన సీన్ తర్వాత సైరా నరసింహా రెడ్డి గుర్రం మీద వస్తూ ఒక ఎద్దుల సమూహాన్ని కాపాడే సీన్ అదిరిపోయింది. ఫాన్స్ ఈలలేసి గోలచేసే సీన్ అవ్వుద్ది.

01.00 A.M IST: రాయలసీమ ప్రాంతంలోని 61 సంస్థానాలను ఒకటి చేయడానికి సైరా నరసింహారెడ్డి ఒక జాతరని ఏర్పాటు చేసారు. భారీ బడ్జెట్ తో 4500 మంది డాన్సర్స్ తో 14 రోజులు షూట్ చేసిన జాతర సాంగ్ మొదలైంది. విజువల్స్  సూపర్బ్..

12.55 A.M IST: ‘సైరా’ కథ అసలు హీరో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవిని అండర్ వాటర్ లో శివలింగం మీదుగా ధ్యాన ముద్రలో పరిచయం చేశారు. ఈ సీన్ ద్వారా జల స్తంభన విద్యలో  ఆయన నిష్ణాతుడని, శివుడికి గొప్ప భక్తుడని చెప్పారు.

12.50 A.M IST: సైరా తాతగారి పాత్రలో నాజర్ ఎంట్రీ. అలాగే నరసింహా రెడ్డి గురువుగా  అమితాబ్ బచ్చన్ పరిచయం అయ్యారు. ఆయన లుక్, వాయిస్, డైలాగ్స్ అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి.

12.43 A.M IST: అక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ మీద బ్రిటిష్ వారిపై మొదట దండెత్తిన వారి గురించి మాట్లాడుతూ 1857లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ ని పరిచయం చేశారు. తెలుగు లేడీ సూపర్ స్టార్ అనుష్క ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో సూపర్బ్ ఉంది. అలాగే ఈ సీన్ లో డైలాగ్స్ అదిరిపోయాయి.  అలాగే తన సైన్యంలోని సైనికులకి సైరా నరసింహా రెడ్డి కథ చెప్పడం మొదలు పెట్టింది.

12.37 A.M IST: లండన్ లోని బకింగ్ హాం ప్యాలస్ లో కథ మొదలైంది.

12.35 A.M IST: 170.50 నిమిషాల రన్ టైంతో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ మొదలైంది..

లేటెస్ట్ అప్డేట్: కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రీమియర్స్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలు కానుంది. యుఎస్ టైం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకి, మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 12:30 నిమిషాలకి షో మొదలవుతుంది.

మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం యొక్క యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీ ని తప్పక చూడండి అక్టోబర్ 1st @ 1:00 PM CST, 11:30 PM IST

For Live updates in English language, then please follow this LINK
For USA Movie ticket discount offers, please check this LINK
For Sye Raa Worldwide Hungama details, check this LINK

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...