Switch to English

Home స్పెషల్ షాకిస్తున్న టివి సీరియల్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ ?

షాకిస్తున్న టివి సీరియల్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ ?

0
షాకిస్తున్న టివి సీరియల్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ ?
WhatsApp-Image-2019-05-10-at-13.28.37
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

టెలివిజన్ రంగంలో వచ్చిన మార్పులు ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకప్పుడు కేవలం దూరదర్శన్ కే పరిమితమైన టివి ఇప్పుడు అన్ని రకాల ఎంటర్ టైమెంట్ ఇస్తూ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళలను గడప దాటనీయడం లేదు. రకరకాల షోస్ ఎన్ని ఉన్నా మహిళలను ఆకట్టుకునేవి కేవలం సీరియల్స్ మాత్రమే. అవతలి వాళ్ళ జీవితం గురించి ఎదో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెంచి టివి సీరియల్స్ ని మహిళలు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. టివిల వల్ల అటు సినిమా రంగంలో కూడా పెను మార్పులు సంభవించాయి. టివి అందించే ఎంటర్ టైన్మెంట్ కంటే అంతకు మించి ఎదో అందిస్తే తప్ప ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్ వైపుకు కన్నెత్తి చూడడం లేదు .. దానికి మరో కారణం ఉంది .. అదే అతిగా పెరిగిపోయిన టికెట్ రేట్స్. ఒక ఫ్యామిలీలో ఐదుమంది సినిమాకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఏ 2000లో సమర్పించుకోవలసిన పరిస్థితి. అందుకే మహిళా ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్ వైపుకు కదలడం లేదు.

ఇక టివి సీరియల్స్ విషయంలో ఎన్ని సాగతీతలు ఉన్నా సరే దాన్ని రెగ్యులర్ గా చూస్తూ పక్కింటి వదిన, ఎదురింటి పిన్నితో షేర్ చేసుకోవడం మహిళలకు నచ్చిన విషయం. ఇక మహిళా ప్రేక్షకులను ఎలాగైనా కట్టిపడేయాలన్న ఆలోచనతో సదరు టివి సీరియల్స్ లో నటించే మహిళలు .. తమలో ఉన్న నటన అంతా బయటపెట్టి నటిస్తూ .. జీవిస్తున్నారు. ఈ మధ్య టివి సీరియల్స్ లో నటించేందుకు పలువురు సినిమా తారలు కూడా ఆసక్తి చూపడానికి కారణం ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా ఇంకా దగ్గరవ్వడమే. ఈ విషయం పక్కన పెట్టి అసలు విషయంలోకి వద్దాం.. మనం ఏ తెలుగు ఛానల్ బటన్ నొక్కినా ఎదో ఓ సీరియల్ ప్రసారం అవుతూనే కనిపిస్తుంది. ఆయా సీరియల్స్ లో నటీమణులు తమ ఓవర్ టాలెంట్ తో ప్రేక్షకులను టివికి అతుక్కుపోయేలా చేస్తున్నారు. నిజానికి టివి సీరియల్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ తెలిస్తే ..మీరు షాక్ అవుతారు ? ఎందుకంటే సినిమా హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం వాళ్లకు అందుతుంది మరి. పైగా రోజు షెడ్యూల్ తప్పకుండా టంచనుగా షూటింగ్ లొకేషన్స్ కు వెళ్ళిపోవాలి.

మరి టివి సీరియల్ అర్టిస్టులు .. వారి రెమ్యూనరేషన్ గురించి ఓ లూకేద్దాం ..

ఇప్పుడు మనం ఏ టివి ఛానల్ నొక్కినా మంగమ్మగారి మనుమరాలు, ముద్దా మందారం, అమెరికా అమ్మాయి, కెరటాలు, మనసు మమతా, అష్టాచెమ్మా, సీతారత్నం గారి అబ్బాయి, అత్తారింటికి దారేది ..అబ్బో .. ఇలా ఎన్నో టివి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ తో జోరుగా వినిపిస్తూ తెలియని విలనిజంతో ఏ సీరియల్ చుసిన దాదాపు లేడి విలన్స్ .. ఎక్కడ కూడా కనిపించని మమతానురాగాలు, ఎప్పుడు ఆస్తి తగాదాలే కనిపిస్తుంటాయి …దానికి తోడు ఈ మధ్య ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం .. లేక పెళ్లి చేసుకోవడం .. అబ్బా పేర్లు ఏవైనా అన్ని ఆ ఒడ్డుకే చేరుతున్నాయిలే. డైలీ సీరియల్స్ పుణ్యమా అని కమర్షియల్ యాడ్స్ వాళ్లకు పండగే పండగ. ఈ టివి సీరియల్స్ ని చూసేందుకు మహిళలు టంచనుగా టైం కు టివిల ముందు అతుక్కుపోతున్నారు. నిజానికి టివి సీరియల్స్ కు బానిసలుగా మారిన మహిళలు చాలా మందే ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.

టివి సీరియల్స్ నటీమణులకు ఆయా టిఆర్పి రేటింగ్ బట్టి రెమ్యూనరేషన్ అందుతుంది. అంటే అయా నటీమణి తన నటనతో ఆకట్టుకుని అందులో జీవిస్తే ఆ సీరియల్స్ ఎక్కువమంది చుస్తే దాని టిఆర్పి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దాంతో ఆ నటి బాగా చేస్తుందని తెలిసి ఆఫర్స్ కూడా ఎక్కువగా వస్తాయి .. దాంతో పాటు రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే టివి సీరియల్స్ నటీమణులకు రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు ? అన్నది అసలు ప్రశ్న ! నిజానికి వీరికి రోజువారీ వేతనం ఉంటుంది. ఆర్టిస్ట్ ని బట్టి ఒకరోజు ఇంత అని వసూలు చేస్తారు. మరి ఎవరి రెమ్యూనరేషన్ ఎలా ఉందొ ఓ సారి పరిలిస్తే.

1. పల్లవి

పసుపు కుంకుమ సీరియల్ మీకు బాగా గుర్తుందిగా .. ఆ సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న పల్లవి తనదైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మయి చేసేది ఈ ఒక్క సీరియలే అయినా నటన, గ్లామర్ విషయాలతో ఆకట్టుకున్న ఈమె నటనకు తెలుగు మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఒక్క సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న పల్లవి ఒకరోజుకు 15000 రూపాయలు వసూలు చేస్తుందట. ఒక సీరియల్ కోసం ఎన్ని రోజులు కాల్షీట్స్ అవసరమవుతాయో చూసుకుంటే పల్లవికి నెలకు ఏ రేంజ్ రెమ్యూనరేష అందుతుందో చెప్పాల్సిన పనిలేదు. ముందు ముందు పల్లవికి రెమ్యూనరేష ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

2. సుహాసిని

తెలుగులో చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసిని తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు రావాల్సిన కమర్షియల్ బ్రేక్ మాత్రం రాలేదు .. దాంతో ఈమే టివి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం సుహాసిని తెలుగు టివి సీరియల్స్ లో ఎక్కువ రెమ్యూనరేశాన్ తీసుకుంటున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. యువరాణి, అష్టాచెమ్మా, ఇద్దరమ్మాయిలతో వంటి సీరియల్స్ లో నటిస్తున్న సుహాసిని రోజుకు 25000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అంటే నెలకు ఎంత అవుతుందో మీరే తెలుసుకోండి. ఈ లెక్కన సినిమా హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదిస్తుంది.

3. హరితేజ

హరితేజ ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో మంచి పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ రెండో సీజన్ లో ఛాన్స్ కొట్టేసి స్టార్ గా మారిపోయింది. ఇప్పుడు హరితేజకు మంచి డిమాండ్ ఉంది. కేవలం టివి సీరియల్స్ మాత్రమే కాకుండా టివి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ వంటి వాటితో జోరుగా సాగిపోతుంది. ప్రస్తుతం హరితేజ కు ఉన్న డిమాండ్ ఇంకెవరికి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు టివి సీరియల్ కోసం రోజులు 10000 వసూలు చేస్తుందట. ఓ వైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది హరితేజ.

4. జ్యోతి

మంగమ్మగారి మనుమరాలు సీరియల్ లో లక్ష్మి పాత్రతో అందరిని ఆకట్టుకున్న జ్యోతికి ఇది మొదటి సీరియల్. ఈ సీరియల్ తోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న జ్యోతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే విధి 2, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సీరియల్స్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సీరియల్ లో జ్యోతి నెగిటివ్ రోల్ లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. ప్రస్తుతం ఈమె రోజుకు 10000 రెమ్యూనరేషన్ తీసుకుంటూ మంచి జోరుమీదుంది.

5. శ్రీ వాణి

చంద్రముఖి సీరియల్ అందరికి గుర్తిందిగా .. చాలా రోజులుగా వస్తున్న ఈ సీరియల్ ఏకంగా 1000 ఎపిసోడ్స్ కూడా పూర్తీ చేసుకున్నట్టుంది. ఈ సీరియల్ లో శ్రీవాణి నటన ప్రధాన హైలెట్. ఈ సీరియల్ తో పాటు మనసు మమతా, కలవారి కోడలు, రాములమ్మ, లాంటి సీరియల్స్ లో నటిస్తూ మంచి నటిగా ఇమేజ్ తెచ్చుకున్న శ్రీవాణి రోజువారీ వేతనం 10000.

6. నవీన

చంద్రముఖి సీరియల్ లో నవీన నటనకు పేరు పెట్టేదే లేదు. తన పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన దాంతో పాటు మల్లీశ్వరి, కలవారి కోడళ్ళు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారింది. నవీన రోజువారీ పారితోషికం 10000. నెగిటివ్ రోల్స్ లో బాగా చేయగలదన్న పేరు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

7. సుజిత

పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సుజిత అందరికి సుపరిచితురాలే. బాలనటిగా .. ఆ తరువాత జై చిరంజీవ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించిన సుజిత పలు చిత్రాల్లో నటించింది. ఆ తరువాత టివి సీరియల్స్ కి షిఫ్ట్ అయిన ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు టివి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. కలిసుందాం రా, కలవారి కోడలు, గంగోత్రి,ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే, సుజిత కూడా రోజుకు 15000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. అన్నట్టు సుజిత ఎవరో కాదు దర్శకుడు సూర్యకిరణ్ ( హీరోయిన్ కళ్యాణి భర్త ) కు స్వయానా చెల్లెలు.

8, మెరీనా

ఉయ్యాలా జంపాల సీరియల్ లో నటిస్తున్న మెరీనా మొదటి సీరియల్ అమెరికా అమ్మాయి. అచ్చంగా అమెరికా అమ్మాయిల కనిపించే మెరీనా తనదైన నటనతో అందరిని తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం వస్తున్న ఉయ్యాలా జంపాల సీరియల్ లో ఆమె నటనకు చాల మంది మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈమె కూడా రోజువారీ వేతనం కింద దాదాపు 6000 వరకు వసూలు చేస్తుందట.

9, అంజు

పూర్తి పేరు అంజు అస్రాణి .. నార్త్ ఇండియన్ అయిన ఈ నటి తెలుగులో చక్కటి బాషా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎక్కువ సీరియల్స్ లో నటించిన నటిగా ఇమేజ్ తెచ్చుకున్న అంజు ఇప్పటి వరకు 35 కు పైగా సీరియల్స్ లో నటించింది. నెగిటివ్ రోల్స్ కూడా అద్భుతంగా చేస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ప్రస్తుతం అంజు నటిస్తున్న అగ్నిపూలు సీరియల్ జోరుగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె రోజువారీ పారితోషికం 7500 వరకు వసూలు చేస్తుందట. మొత్తానికి ఇంకా చెప్పుకుంటూ పొతే చాలా మంది నటీమణులు ఉన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కంటే టివి సీరియల్స్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ సంపాదిస్తూ దూసుకుపోతున్నారు.