నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న న్యూస్ నందమూరి అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఎందుకంటే సింహ, లెజెండ్ లాంటి సంచలన విజయాలను బాలయ్యకు అందించాడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందన్న ఆనందంగా కొంతసేపే మిగిలేలా చేసింది. ఎందుకంటే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పేసాడు. దాంతో బాలయ్యతో సినిమా ఆగస్టులో పట్టాలు ఎక్కిస్తానని బోయపాటి చెప్పాడు. ఈ గ్యాప్ లో బోయపాటి శ్రీను కూడా మరో హీరోతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. వినయ విధేయ రామ సినిమా ప్లాప్ తో కాస్త డీలా పడ్డ బోయపాటి శ్రీను ఎలాగైనా మరో హీరోతో సినిమా చేసి హిట్టు కొట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు.
అయితే బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్న విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొల్పింది. పక్కా మాస్ అంశాలతో ఓ సూపర్ కథను సిద్ధం చేసాడట. కథ విషయంలో పూర్తిగా స్క్రిప్ట్ అయ్యాకే హీరో ఎవరన్నది చెబుతానని బోయపాటి శ్రీను అంటున్నాడు. మొత్తానికి బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా విషయంలో హీరో ఎవరన్న క్యూరియాసిటీ మాత్రం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
మరో వైపు బాలయ్య కోసం కూడా ఓ సూపర్ కథ సిద్ధం చేస్తున్నానని చెప్పాడు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆ రేంజ్ కథను సిద్ధం చేసేందుకు టైం పడుతుందని అన్నాడు. మరోవైపు వినయ విధేయ రామ ప్లాప్ వల్లే బాలయ్య మనసు మారిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే బోయపాటి సరైన హిట్ కొట్టాకే బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.